Recent Posts

గాంధీ మనువరాలికి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష

అమరావతి: గాంధీజీ మనవరాలు, దక్షిణాఫ్రికాలోని ప్రముఖ మానవహక్కుల కార్యకర్త ఈలా గాంధీ కుమార్తె లతా రామ్‌గోబిన్(56) రూ.3.22 కోట్లు మోసం,ఫోర్జరీ పాల్పపడిన కేసులో అమెకు ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ డర్బన్ కోర్టు తీర్పు చెప్పింది..అహింసపై ఏర్పాటైన ఒక NGO సంస్థలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ఈమె, 2015 ఆగస్ట్‌ లో న్యూ ఆఫ్రికా అలయన్స్ ఫుట్ వేర్ డిస్ట్రిబ్యూటర్స్ డైరెక్టర్ ఎస్ఆర్ మహారాజ్‌ను కలుసుకున్నారు.. అతని సంస్థ దుస్తులు,పాదరక్షలను దిగుమతి చేసుకుని తయారు చేసి విక్రయిండతో పాటు ఇతర సంస్థలకు లాభ-వాటా ప్రాతిపదికన ఫైనాన్స్‌ ను అందిస్తుంది..దక్షిణాఫ్రికా హాస్పిటల్ గ్రూప్ నెట్ కేర్ కోసం తాను భారత్ నుంచి మూడు లినెన్ కంటైనర్లను దిగుమతి చేసుకున్నానని,,అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా కస్టమ్స్ సుంకాలు చెల్లించలేకపోతున్నానని,,కంటైనర్లను తెప్పించుకునేందుకు తనకు కొంత ఆర్థిక సాయం అందించమన్నారు..ఇందుకు ప్రతిగా తనకు వచ్చే లాభాల్లో షేర్ ఇస్తానని హామీ ఇచ్చారు.. దక్షిణాఫ్రికాలో లతా రాంగోబిన్ కుటుంబ పరపతి తెలిసిన మహరాజ్ ఆమెకు 6.2 మిలియన్ రాండ్ల నగదు ఇచ్చారు..కొన్ని రోజుల తరువాత అమె నుంచి ఎలాంటి స్పందన లేక పోవడంతో ఆరా తీయగా, ఆమె భారత్ నుంచి ఎటువంటి సరకు దిగుమతి చేసుకోలేదని,ఆమె చూపించిన డాక్యుమెంట్లన్నీ నకిలీవని తెలిసింది..దీంతో మహరాజ్ లతపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.. 2015లో కేసు నమోదు కాగా అప్పటి నుంచి ఆమె బెయిల్‌పై బయటకు వన్నారు.. సోమవారం తుది విచారణ జరిపిన డర్బన్ న్యాయస్థానం ఈ కేసులో ఆమెను దోషిగా తేలుస్తూ 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది.. ఆమెకు శిక్షపై అప్పీల్ చేసుకునే అవకాశం కూడా కోర్టు ఇవ్వలేదు..

Spread the love