Recent Posts

హైదరాబాద్ లో లాక్ డౌన్ మరో 10 రోజులు-సాయంత్రం 6 వరకు అనుమతి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరో 10 రోజులు లాక్‌డౌన్‌ పొడిగిస్తు కేబినెట్ నిర్ణయం తీసుకుంది..మంగళవారం ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కే.సి.ఆర్ ఆధ్వర్యంలో సమావేశంమైన మంత్రి వర్గం,కరోనా పరిస్థితులపై చర్చిన అనంతరం లాక్ డౌన్ సమయాన్నిఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సడలింపులు ఇచ్చింది..అలాగే సాయంత్రం 5 గంటల నుంచి  మరో గంటపాటు ఇంటికి చేరుకునేందుకు వెసులుబాటు కల్పించింది..సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కఠినంగా లాక్‌డౌన్‌ అమలు కానుంది..కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ఖమ్మం జిల్లా మధిర, సత్తుపల్లి,,నకిరేకల్‌ మినహా మిగతా నల్లగొండ జిల్లాలో ప్రస్తుత లాక్‌డౌన్‌ స్థితి కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటించింది..

Spread the love