Recent Posts

ఈనెల 20వ తేది వరకు లాక్ డౌన్ పొడగింపు-మధ్యహ్నం 2 గంటల వరకు సడలింపు

అమరావతి: కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉధృతి అదుపులోకి వస్తున్న సూచనలు కన్పించడంతో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సడలింపులతో ఈనెల 20వ తేది వరకు లాక్ డౌన్ పొడిగించింది..కర్ఫ్పూ ఆంక్షలు ఇప్పటి వరకు ఉదయం 6 నుంచి 12 వరకు మాత్రమే ఆమల్లో వుండగా,,తాజాగా మరో రెండు గంటలు ఆంక్షలు సడలించారు..ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పని చేయనున్నాయి.శుక్రవారం నుంచి  ప్రజల రాకపోకలు, దుకాణాలు తెరచుకునేందుకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు..మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ యధాతధంగా ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.. కరోనా వైరస్ నివారణ చర్యలపై సీ.ఎం వైఎస్‌ జగన్‌ సోమవారం తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష చేపట్టారు..సమీక్షకు డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, కోవిడ్‌ టాస్క్‌ ఫోర్స్‌ అధికారులు హాజరయ్యారు.. ప్రస్తుతం అమల్లో ఉన్న కర్ఫ్యూ గడువు ఈ నెల 10వ తేదితో ముగియనున్ననేపథ్యంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఉన్నతాధికారులతో సమీక్షించిన సీఎం వైఎస్‌ జగన్‌.. మరో పది రోజులపాటు కర్ఫ్యూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు..గతంలో ఉన్న కరోనా నిబంధనలు యధాతథంగా అమలులో ఉంటాయని,,మాస్కు ధరించడం,,సామాజిక దూరం పాటించడం తప్పనిసరి..అలాగే పెళ్లిళ్లకు 40 మందికి, ఇతర ఫంక్షన్లకు 20 మందికి మాత్రమే అనుమతి వుంటుంది..మరణాలు,అంత్యక్రియలకు 20 మందికి మాత్రమే అనుమతి..ఈ నిబంధనలు కచ్చితంగా ప్రతి ఒక్కరూ పాటించాలని ప్రభుత్వం సూచించింది.. 

Spread the love