AMARAVATHIHYDERABADPOLITICS

కాంగ్రెస్‌ పార్టీ దిగ్గజ నాయకుడు ధర్మపురి శ్రీనివాస్‌ కన్నుమూత

హైదరాబాద్: కాంగ్రెస్‌ పార్టీ దిగ్గజ నాయకుడు,,మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్‌(76), శనివారం తెల్లవారుజామున 3 గంటలకు తుదిశ్వాస విడిచారు..1948 సెప్టెంబర్ 27న నిజామాబాద్‌ జిల్లా వేల్పూరులో జన్మించారు..నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తిచేశారు..అనంతరం 10 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేశారు..రాజకీయ ప్రస్తానంలో, విద్యార్థి సంఘ నాయకుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన డి.ఎస్,,NSUI, యువజన కాంగ్రెస్‌లో పనిచేశారు.. తొలిసారిగా 1989లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎన్నికల బరిలో దిగిన శ్రీనివాస్‌. నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గంలో గెలుపొందారు.. అనంతరం 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు.. 1989 నుంచి 1994 వరకు గ్రామీణాభివృద్ధి,, ఐ అండ్‌ పీఆర్‌ మంత్రిగా, 2004 నుంచి 2008 వరకు ఉన్నతవిద్య, అర్బన్‌ లాండ్‌ సీలింగ్‌ శాఖ మంత్రిగా పనిచేశారు. 2004లో అప్పటి టీఆర్‌ఎస్‌తో పోత్తుకుదుర్చుకోవడంలో కీలకపాత్ర పోషించారు..2013 నుంచి 2015 మధ్య ఎమ్మెల్సీగా సేవలందించారు..తెలంగాణ ఆవిర్భావంత తరువాత మండలి విపక్ష నేతగా పనిచేశారు.. రెండవ సారి ఎమ్మెల్సీగా అవకాశం రాకపోవడంతో 2015లో కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి,, బీఆర్‌ఎస్‌లో చేరారు..రాష్ట్ర ప్రభుత్వ అంతర్‌ రాష్ట్ర వ్యవహారాల సలహాదారుగా పనిచేశారు.. 2016 నుంచి 2022 వరకు బీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు..కొంతకాలం తరువాత బీఆర్‌ఎస్‌తో విభేదించిన ఆయన తన పదవీ కాలం ముగిసే వరకు పార్టీకి దూరంగా ఉన్నారు.. అనంతరం ఆ పార్టీకి రాజీనామాచేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు..ఇదే సమయంలో అనారోగ్య సమస్యలతో డీఎస్ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.. అయనకు భార్య,ఇద్దరు కుమారులు.. పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్ గా పనిచేశారు..రెండో కుమారుడు ధర్మపురి అర్వింద్.. ప్రస్తుతం బీజేపీ తరపున నిజామాబాద్ ఎంపీగా కొనసాగుతున్నారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *