Recent Posts

రాబోయే నెలలో LED TV ధరలు రూ.3 నుంచి రూ.5 వేల వరకు పెరిగే ఆవకాశం!

అమరావతి: LED TV ల ధరలు త్వరలో పెరిగేందుకు ఆవకాశలు వున్నాయి..అంతర్జాతీయ మార్కెటోల్ ఓపెన్ సెల్ ప్యానల్స్ ధరలు పెరిగిన నేపథ్యంలో దేశీయ మార్కెట్లపై ఆ ప్రభావం పడనుంది..గత నెల రోజులుగా ఓపెన్ సెల్ ప్యానల్స్ ధరలు 35 శాతం పెరిగాయి..దింతో పానాసోనిక్,, హేయర్,, థామ్సన్ వంటి బ్రాండ్స్ టీవీల ధరలు ఏప్రిల్ నెల నుంచి పెరగవచ్చు? ఎల్‌జీ కంపెనీ ఇప్పటికే తమ ఉత్పత్తులపై పెరిగిన ధరలను వెంటనే ఈ కంపెనీలు ఆ భారాన్ని కస్టమర్లకు మోపాయి..గత నెల రోజులుగా ప్యానెల్ ధరలు పెరుగుతున్నాయని,, దీంతో ఏప్రిల్ నుంచి టీవీల ధరలు కూడా పెరిగే అవకాశముందని,,ప్రస్తుతం వున్న మార్కెట్ ను గమనిస్తే,,టీవీల ధరలు ఐదు శాతం నుంచి ఏడు శాతం పెరగవచ్చని పానాసోనిక్ సౌత్ ఇండియా ప్రెసిడెంట్,, సీఈవో మనీష్ శర్మ తెలిపారు..హేయర్ ఇండియా అధ్యక్షులు బ్రగాంజా కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు..ఇప్పుడున్న పరిస్థితుల్లో ధరల పెంపు మినహా మరో మార్గం లేదన్నారు..టీవీల తయారీలో ఓపెన్ సెల్ ప్యానెల్ కీలకం కాగా మొత్తం టీవీలో ఇదే అరవై శాతం ఉంటుంది..ఇటీవల కాలంలోనే అంతర్జాతీయ మార్కెట్లో వీటి ధరలు 35 శాతం పెరిగాయి..డిమాండ్‌కు అనుగుణంగా ఓపెన్ సెల్ ప్యానెల్ తయారీ లేకపోవడంతో మార్కెట్లో వీటి కొరత ఏర్పడిందని,,అందుకే గత ఎనిమిది నెలల్లో వీటి ధర మూడు రెట్లు పెరిగిందని మార్కెట్ విశ్లేషకు భావిస్తున్నారు.. ఏప్రిల్ నుంచి టీవీల ధరలు షుమారుగా రూ.2వేల నుంచి రూ.3వేల వరకు పెరగవచ్చని,,అలాగే 32 ఇంచెస్ టీవీలు రూ.5వేల నుంచి రూ.6వేలు పెరిగే అవకాశముందని వ్యాఖ్యనిస్తున్నారు..

Spread the love