Recent Posts

కోర్టు ఆవరణంలోనే నిందితుడిపై కాల్పులు జరిపిన లాయర్

అమరావతి: కేసు విచారణకు హాజరయ్యేందుకు వివరాలు కనుక్కొనేందుకు వచ్చిన నిందితుడిని కోర్టు బిల్డింగ్‌లోనే ఓ లాయర్ తుపాకీతో కాల్చి చంపాడు..సోమవారం ఢిల్లీలోని ద్వారకా కోర్టులో ఒక కేసులో నిందితుడిగా ఉన్న ఉపకార్‌‌ అనే వ్యక్తి వెళ్లాడు..కోర్టు బిల్డింగ్‌లోని చాంబర్ నెంబర్ 444లో అరుణ్ శర్మ అనే లాయర్‌‌తో మాట్లాడుతుండగా ఒక్కసారిగా ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపాడు.ఆ సమయంలో అక్కడ లాయర్లు, పోలీసులతో పాటు మరికొందరు పిటిషనర్లు ఉన్నారు. అక్కడ వున్నవారు అప్రమత్తమై,తుపాకీతో కాల్చిన వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నించినా అతడు చిక్కకుండా పారిపోయాడు.బుల్లెట్‌ గాయాలైన ఉపకార్‌‌ను ఆస్పత్రికి తరలించినప్పటికీ, తీవ్ర రక్తస్రావం కావడంతో అతడు మరణించాడు.అయితే ఈ సంఘటన సోమవారం రాత్రి 9 గంటల టైమ్‌లో జరిగిందని, కాల్పులు జరిపిన వ్యక్తిని ఒక లాయర్‌‌గా గుర్తించామని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న కాల్పులు జరిపిన లాయర్‌‌ను పట్టుకునేందుకు వేర్వేరు టీమ్స్‌ గా ఏర్పడి గాలిస్తున్నమని పోలీసులు తెలిపారు..

Spread the love