Recent Posts

లష్కరే తొయిబా టాప్ కమాండర్ ఎదురు కాల్పుల్లో హతం

అమరావతి: జమ్మూ కశ్మీర్‌లోని షోపియాన్‌లో సోమవారం భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు మృతి చెందారు. వీరిలో లష్కరే తొయిబాకు చెందిన ఇష్ఫాక్ దార్ అలియాస్ అబూ అక్రమ్ అనే టాప్ కమాండర్ ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు.ఈ ఎదురు కాల్పుల్లో మరణించిన అబూ అక్రమ్‌కు గతంలో పోలీసులను చంపిన కేసులోనూ ప్రధాన నిందితుడిగా ఉన్నాడని,సౌత్ కశ్మీర్‌లోని జానిపొరా గ్రామంలో 2018లో నలుగురు పోలీసులను టెర్రరిస్టులు చంపారని తెలిపారు..ఈ కేసుతోపాటు 2019లో చిత్రిగామ్‌లో ఇద్దరు నాన్ లోకల్ డ్రైవర్లను చంపిన ఘటనలోనూ అబూ అక్రమ్‌కు ప్రధాన హస్తం ఉందని పోలీసులు తెలిపారు. ‘భద్రతా దళాలు, పోలీసులతోపాటు సాధారణ ప్రజలపై పక్కా ప్లాన్‌తో దాడులు చేయడంలో అబూ అక్రమ్ సిద్ధహస్తుడు. యువతను తప్పుదోవ పట్టించి టెర్రరిస్టులతో చేతులు కలిపేలా చేయడంలో అతడు నేర్పరి. జొనిపొరాలో పోలీసులను చంపిన ఘటనలో అతడి హస్తం ఉంది’ అని సీనియర్ పోలీసు అధికారి పేర్కొన్నారు.. 

Spread the love