నెల్లూరు: రామాయపట్నం పోర్టుకు సంబంధించిన భూసేకరణ, పునరావాస పనులను వేగవంతం చేయాలని సంబంధిత రెవిన్యూ అధికారులను జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఆదేశించారు.సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో రామాయపట్నం పోర్టు భూసేకరణ, పునరావాసం గురించి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పోర్టు పరిధిలోని 2 ఎకరాల 44 సెంట్లలో చుక్కల భూములను పట్టా భూములుగా మార్చినందున, వెంటనే ఆయా భూముల వివరాలను రెవెన్యూ రికార్డులలో నమోదు చేయాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వ భూములలో పంటలు సాగు చేసిన రైతులకు పంట నష్ట పరిహారం చెల్లించుటకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. గుడ్లూరు మండలంలోని ఆవులపాలెం, మొండివారిపాలెం,కర్లపాలెం గ్రామాల ప్రజలకు సంబంధించి పునరావాస కాలనీల నిర్మాణం కొరకు భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.ఈ సమావేశంలో కందుకూరు శాసనసభ్యులు, మాజీ మంత్రి మానుగుంట మహీధర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ హరేంధర్ ప్రసాద్ కందుకూరు ఆర్ డి ఓ ఉమాదేవి పాల్గొన్నారు.
రామాయపట్నం పోర్టుకు సంబంధించిన భూసేకరణ వేగంగా పూర్తి చేయాలి-కలెక్టర్
