Recent Posts

కృష్ణపట్నం ఆనందయ్యకు నోటీసులు ఇచ్చిన అయుష్ శాఖ

అమరావతి: నెల్లూరుజిల్లా కృష్ణపట్నం ఆనందయ్యపై ఆయుష్‌ శాఖ తీవ్రంగా స్పందించింది..ఒమైక్రాన్‌ వైరస్ తగ్గిపొతుందని, ఆనందయ్య మందు పంపిణీ చేయడంపై ఆయుష్‌ శాఖ నోటీసులిచ్చింది. మందుకు సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని అధికారులు ఆదేశించారు.ఆనందయ్య పంపిణీ చేస్తోన్న ఒమైక్రాన్‌ మందుకు అనుమతి లేదని ఆయుష్‌ కమిషనర్‌ రాములు తెలిపారు.అనుమతి లేకుండా పంపిణీ ఎలా చేస్తారంటూ నోటీసులు ఇచ్చామని చెప్పారు. ఒమైక్రాన్‌ మందులో ఏమేం పదార్థాలు వాడుతున్నారో, చెప్పాలని ఆనందయ్యకు నోటీసుల్లో స్పష్టం చేశామన్నారు. ఆనందయ్య సమాధానం బట్టి తదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు. లైసెన్స్‌ కోసం యూజర్ ఐడీ, పాస్‌ వర్డ్‌ తీసుకున్నారని, కానీ ఇప్పటి వరకు దరఖాస్తు పెట్టలేదన్నారు. ఆనందయ్య అప్లికేషన్‌ పెడితేనే లైసెన్స్‌ లభిస్తుందని పేర్కొన్నారు. కరోనా, ఒమైక్రాన్‌ పేరుతో అనుమతి లేని మందులను వాడొద్దని రాములు సూచించారు.

Spread the love
error: Content is protected !!