Recent Posts

ఉగాది కానుకగా మామిడిపండ్ల రైతులకు ప్రత్యేకంగా కిసాన్ ఎక్స్ ప్రెస్ రైలు-మంత్రి గౌతమ్

అమరావతి: కృష్ణా జిల్లా నూజివీడు నుంచి నేరుగా ఢిల్లీలోని ఆదర్శనగర్ కి మామిడిపండ్ల ఎగుమతికి వ్యాపారమాల ఎక్స్ ప్రెస్ లో భాగంగా నేటి నుంచి ప్రారంభం కావడంతో రాష్ట్రంలోని వేలాది మంది రైతులకు, వ్యాపారులకు భారీ లబ్ది చేకూరుతుందని పరిశ్రమలు,ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు.. భారతదేశంలోని మామిడిపండ్ల ఉత్పత్తిలో 22 శాతం వాటా,, 12 లక్షల అమెరికా డాలర్ల విలువైన ఎగుమతుల భాగస్వామ్యం ఏపీదేనని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు గత నెల ఢిల్లీ పర్యటనలో వివరించి,వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు..తొలి కిసాన్ రైల్ లో ఢిల్లీకి 220 టన్నుల మామిడిపండ్ల రవాణా సోమవారం లాంఛనంగా ప్రారంభమైందన్నారు..సత్వరమే స్పందించి మామిడి పండ్ల సీజన్ దృష్ట్యా కిసాన్ ఎక్స్ ప్రెస్ రైలును ఏర్పాటు చేసిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కు మంత్రి గౌతమ్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు..కేంద్ర ప్రభుత్వం స్పందనతో రాష్ట్రంలో మామిడి పండ్ల రైతులకు నిజమైన ఉగాది పండగొచ్చిందన్న మంత్రి మేకపాటి అన్నారు.. రాష్ట్రంలో ఉద్యానపంటలు అధిక ఉత్పత్తి అవుతున్న,అరటిపండ్లు, టమోటా పండ్లను దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే వీలుగా కిసాన్ రైళ్లను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మరోసారి కేంద్రమంత్రికి మంత్రి మేకపాటి విజ్ఞప్తి చేశారు..ఆరేళ్ళ తర్వాత కిసాన్ రైళ్లను మళ్లీ పున:ప్రారంభం వెనుక మంత్రి మేకపాటి కృషికి ట్విట్టర్ వేదికగా ఎంపీ లావు కృష్ణదేవరాయలు అభినందనలు తెలిపారు..

Spread the love