Recent Posts

మార్కెట్ లోకి త్వరలో కైనెటిక్ లూనా మోపెడ్

అమరావతి: ఇండియాలో 90 ద‌శ‌కంలో కైనెటిక్ లూనా మోపెడ్ అంటే తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదని చెప్పాలి.మధ్య తరగతి ప్రజలకు సైతం లూనా మోపెడ్ లు అందుబాటులో ఉండేవి.పెట్రోల్ అయిపోతే సైకిల్ లాగా తొక్కుకుంటూ వెళ్లిపోవ‌చ్చు.న్యూ జనరేషన్ మోటర్ బైక్స్ రావడంతో వాటి పోటీని తట్టుకోలేక,క్రమేపీ లూనా మోపెడ్ ఉత్పత్తిని కంపెనీ 2000 నుంచి నిలిపివేసింది.ప్రస్తుతం మ‌రోసారి ఈ లూనాల‌ను విప‌ణిలోకి తీసుకొచ్చేందుకు కంపెనీ సిద్ధం అవుతున్న‌ది.ఇప్ప‌టి ట్రెండ్‌కు త‌గ్గ‌ట్టుగా ఎల‌క్ట్రిక్ ఫీచ‌ర్ల‌తో, అప్ప‌టి ల్యూనాకు డిజైన్ తో దీనిని ఉత్ప‌త్తి చేయ‌బోతున్నారు.ఎల‌క్ట్రిక్ వాహ‌నం అయిన్ప‌టికి దీని ధ‌ర త‌క్కువ‌గానే ఉండ‌బోతున్న‌ట్టు కంపెనీ వ‌ర్గాలు ప్ర‌క‌టించాయి. ఒక‌సారి చార్జింగ్ చేస్తే 60 కిమీ దూరం వ‌ర‌కు ప్ర‌యాణం చేయ‌వ‌చ్చు. లూనా 25 కిలోమీట‌ర్ల వేగంతో ప్ర‌యాణం చేస్తుంది కాబ‌ట్టి లైసెన్స్ అవ‌స‌రం లేదు.  ఆక‌ర్ష‌ణీయ‌మైన ఫీచ‌ర్ల‌తో ఈ సంవత్సరం ఈ లూనాను మార్కెట్ లోకి విడుద‌ల చేయ‌నున్న కంపెనీ వర్గాలు,త్వ‌ర‌లోనే దీని ధ‌ర‌ను ప్ర‌క‌టించ‌నున్నారు.  

Spread the love