Recent Posts

20 పైసల ఖర్చుతో కిలో మీటరు ప్రయాణం-Hope Bike

అమరావతి: భారతదేశంలో ఆత్మనిర్భర్ భాగంగా IIT ఢిల్లీలోని విద్యార్దులు డిజైన్ చేసిన బ్యాటరీతో ప్రయాణించే బైక్ ను జెలియోస్‌ స్టార్టప్ కంపెనీ మార్కెట్ లోకి విడుదల చేసింది..ఆ బైక్ పేరు హోప్(HOPE) యువతను విశేషంగా ఆకట్టుకుంటుంది..కొత్తగా వ్యాపారంగంలోకి వస్తోన్న యువత,ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై ఫోకస్ పెంచారు..వినూత్న ఆవిష‌్కరణల వైపు మొగ్గు చూపుతున్నారు..జెలియోస్‌ స్టార్టప్ కంపెనీ సి.ఇ.ఓ అదిత్య తివారీ మాట్లాడుతూ 20 పైసల ఖర్చుతో కిలోమీటర్‌ దూరం ప్రయాణించేలా ఈ స్కూటర్‌ను తయారు చేశామన్నారు.. మార్కెట్‌లో దీని ధర 47వేలు ఉంటుందని,,ఇందులో రెండు రకాల వర్షన్స్ ను అందుబాటులో వుంచామన్నారు..ఒక రకమైన బ్యాటరీ ఉపయోగిస్తే 50 కిలో మీటర్ల దూరం,,మరోక రకం బ్యాటరీతో నడిచే మోడల్ ఉపయోగిస్తే 75 కిలో మీటర్ల దూరం ప్రయాణించ వచ్చారు..కేవలం 4 గంటల వ్యవధిలో బ్యాటరీ పుల్ చార్జీ అవుతుందన్నారు..

Spread the love