Recent Posts

కరోనా వైరస్ నిర్మూలన, వాతావరణ మార్పులపై క్వాడ్‌లో కీలక చర్చ

అమరావతి: అమెరికా పర్యటనలో ప్రదాన మంత్రి నరేంద్రమోదీ బిజీ బిజీగా గడుపుతున్నారు..కరోనా వైరస్ నిర్మూలన, వాతావరణ మార్పులపై క్వాడ్‌లో కీలక అంశంగా చర్చించారు.క్వాడ్ హోస్టింగ్ చేసే అవకాశం ఇచ్చినందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ధన్యవాదాలు తెలిపారు.సమావేశానికి ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ ప్రధానమంత్రి యోషిహిదే సుగా హాజరయ్యారు..కీలక విషయాలపై చర్చించారు. జో బైడెన్‌ అమెరికా ప్రెసిడెంట్ అయ్యాక తొలిసారి ఈ సమావేశం జరిగింది. భారత్-అమెరికా సంబంధాలు మరింత బలపడనున్నాయని బైడెన్ అన్నారు.ఇరుదేశాల సంబంధాల్లో టెక్నాలజీ కీలకపాత్ర పోషించనుందని,వాణిజ్య రంగంలో పరస్పర సహకారం రెండు లాభదాయకమన్నారు.భారత్-అమెరికా సంబంధాల్లో కొత్తశకం మొదలవుతోందని,అమెరికాకు ప్రధాన మిత్రదేశాల్లో భారత్ కూడా ఒకటని స్పష్టం చేశారు..ఇండియా-అమెరికా దేశాల మధ్య వాణిజ్య అంశాలు చాలా కీలకమని,ఈ దశాబ్దంలో ఇరు దేశాలు ఎంతో సహకరించుకున్నాయని ప్రధాని మోడీ చెప్పారు.వాణిజ్య అంశాలు మరింత బలపడడం చాలా అవసరమన్నారు..

Spread the love