Recent Posts

ఈటల నుంచి ఆరోగ్యశాఖను వెనక్కు తీసుకున్న కే.సి.ఆర్

హైదరాబాద్: తెలంగాణ మంత్రి ఈట‌ల.రాజేంద‌ర్ భూ కబ్జా వ్య‌వ‌హారంలో శనివారం వేగంగా కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి..మెదక్ కలెక్టర్ ఈటల భూములు ఆక్రమించింది నిజమే అని నిర్ధారించిన గంటల వ్యవధిలో,,ఈటల ద‌గ్గ‌ర ఉన్న వైద్య ఆరోగ్య‌శాఖ‌ను ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు కేటాయిస్తూ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై ఆదేశాలు జారీ చేశారు..దీంతో, ఏ శాఖ‌లేని మంత్రిగా ఈట‌ల మిగిలిపోయారు..ఈట‌ల నుంచి వైద్య‌,, ఆరోగ్య‌శాఖ త‌ప్పించాల‌ని గ‌వ‌ర్న‌ర్‌కు సీఎం కేసీఆర్ లేఖ రావ‌డంతో,, గ‌వ‌ర్న‌ర్ ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్నారు..ఈట‌ల‌పై భూ క‌బ్జా ఆరోప‌ణ‌లు రావ‌డంతో..విచార‌ణ‌కు ఆదేశించిన సంగ‌తి తెలిసిందే..సంబంధిత గ్రామంలో ప‌ర్య‌టించిన క‌లెక్ట‌ర్, ఇత‌ర అధికారులు,,వారి అభిప్రాయాల‌ను తెలుసుకుని,ప్ర‌భుత్వానికి నివేదిక అంద‌జేశారు.. తన రాజకీయ భవిష్యత్ పై తన అభిమానులతో మాట్లాడిన తరువాత ఎలాంటి నిర్ణ‌యం తీసుకునేది తెలియచేస్తానని ఈటల,మీడియాకు తెలిపారు..రాబోయే రోజులు ఈ పరిమాణలపై తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు..

Spread the love