Recent Posts

పాలమూరు నుంచి వలసలు ఆగిందెక్కడో కేసీఆర్ చెప్పాలి-బండి.సంజయ్

హైదరాబాద్: పాలమూరు పచ్చగా వుందని,, వలసలు పూర్తిగా ఆగిపోయాయంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా టీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు పచ్చి అబద్దాలుగా తేలిపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు..పాలమూరు నుంచి వలసలు ఆగలేదని,,నిత్యం ముంబైకి వందలాది మంది వలస వెళుతున్నారనడానికి ఈ బస్సే నిదర్శనమన్నారు..శుక్రవారం ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 16వ రోజు నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్ర చేశారు.ఈ సందర్భంగా పాదయాత్ర శిబిరం వద్దకు రాగానే అక్కడి నుండి ముంబై వెళుతున్న బస్సును బండి.సంజయ్ గమనించి అందులో ప్రయాణిస్తున్న వారిని ఎక్కడికి వెళుతున్నారంటూ ఆరా తీశారు.వారంతా తాము ఉపాధి కోసం ముంబై వెళుతున్నామని జవాబిచ్చారు.ఈ విషయమై బండి.సంజయ్ మీడియాతో మాట్లాడారు..

Spread the love
error: Content is protected !!