Recent Posts

ఆర్యన్ ఖాన్ కు షూరిటీ ఇచ్చిన జుహీ చావ్లా

అమరావతి: బాంబే హైకోర్టు ఆర్యన్ ఖాన్ కు ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో గురువారం బెయిల్ మంజూరు చేసిన తరువాత పూర్తి వివరాలతో కూడిన బెయిల్ పై మధ్యంతర ఉత్తర్వులను నేడు ప్రకటించింది.ఈ క్రమంలో ఆర్యన్ ఖాన్ ను జైలు నుండి బయటకు తీసుకు రావడానికి లాయర్ల బృందం ఫార్మాలిటీస్ ను పూర్తి చేస్తుంది.ఆర్యన్ ఖాన్ కోసం లక్ష రూపాయల బాండ్‌పై సంతకం చేయడానికి నటి జుహీ చావ్లా శుక్రవారం సాయంత్రం ప్రత్యేక ఎన్డీపీఎస్ (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్) కోర్టుకు చేరుకుని షూరిటీ ఇచ్చారు.

                   ఆర్యన్‌కు బెయిల్ వచ్చినప్పటికీ పోలీసులకు చెప్పకుండా అతడు ముంబైని విడిచి వెళ్లడానికి వీల్లేదు.             

                  అలాగే ప్రతి శుక్రవారం నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) ముందు అతడు తప్పకుండా హాజరు కావాలి. 

    •  బెయిల్ ఉత్తర్వుల ప్రకారం ఆర్యన్ పర్సనల్ బాండ్ కింద కోర్టుకు లక్ష రూపాయలు చెల్లించాలి. 
    • డ్రగ్స్ కేసులో తనతోపాటు అరెస్ట్ అయిన మిగిలిన నిందితులతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్యన్ కాంటాక్ట్‌ లో ఉండకూడదు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఇతరులతోనూ టచ్‌లో ఉండ కూడదు. 
    • ఈ కేసులో సాక్షాలను ప్రభావితం చేయకూడదు. అలాగే ఆధారాలను ధ్వంసం చేయకూడదు.  
    • పాస్‌పోర్ట్‌ ను స్పెషల్ కోర్టు ఎదుట వెంటనే సరెండర్ చేయాలి. 
    • ఈ కేసులో తుది తీర్పు వెల్లడించేంత వరకు దీని గురించి మీడియా (ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా)లో ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు. 
    • స్పెషల్ జడ్జి పర్మిషన్ లేకుండా దేశం విడిచి వెళ్లడానికి వీల్లేదు. 
    •  గ్రేటర్ ముంబైని దాటి బయటకు వెళ్లాలంటే ఈ కేసులో విచారణ చేస్తున్న అధికారికి సమాచారం ఇవ్వాలి. ఎక్కడికి వెళ్తున్నది అనే విషయాన్ని ఆఫీసర్‌కు తెలియజేయాలి. 
    • కోర్టుకు తప్పకుండా హాజరవ్వాలి.
    • ఎన్‌సీబీ అధికారులు విచారణకు పిలిచినప్పుడు తప్పనిసరిగా వెళ్లాలి. 
    • ఆర్యన్ ఖాన్ మరో రాత్రి జైలులోనే గడపవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆయన తరపు లీగల్ టీమ్ సకాలంలో బెయిలు  పత్రాలను జైలు అధికారులకు సమర్పించలేకపోవడంతో శుక్రవారం ఆయన విడుదల కాలేదు. ఆయన విడుదలయ్యేది శనివారమేనని ఆర్థర్ రోడ్ జైలు అధికారులు తెలిపారు. 
Spread the love
error: Content is protected !!