Recent Posts

బ్రౌజింగ్ అగిపోకుండా డేటా లోన్ ఆప్షన్స్ తెచ్చిన జియో

అమరావతి: రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ వినయోగదారుల కోసం కొత్త ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది..మొబైల్ డేటా అయిపోతే అదనపు డేటా రీచార్జ్ చేసుకునే పరిస్థితిలో లేని వారి కోసం,, కొన్ని ఆప్షన్స్ తో 1GB డేటాను లోన్ తీసుకునే సదుపాయం అందుబాటులోకి తెచ్చింది..ఎమర్జెన్సీ డేటా లోన్ ఫీచర్ కింద ప్రీపెయిడ్ వినియోగదారులు ముందుగా డేటా తీసుకుని తరువాత పే చెయవచ్చు..కొన్ని పరిస్థితుల్లో డేటా అయిపోతే రీచార్జ్ చేసుకునే అవకాశం లేని పరిస్థితుల్లో ఉన్న వారు కంగారు పడాల్సిన అవసరం లేకుండా రూ.11 చెల్లించి 1 GB డేటా లోన్ పై తీసుకోవచ్చు..ఈ ఆప్షన్స్ ఉపయోగించుకోవాలంటే,,మై జియో యాప్ డౌన్లోడ్ చేసుకుని ఉండాలి..యాప్ లో మెను బటన్ లోనే ఎమర్జెన్సీ లోన్ అనే ప్షన్ కనిపిస్తుంది..దాన్ని క్లిక్ చేయగానే ప్రొసీడ్ అని సూచిస్తుంది..అలా ప్రొసీడ్ బటన్ నొక్కి గెట్ ఎమర్జెన్సీ డేటాను క్లిక్ చేస్తే  1 GB డేటా రీచార్జ్ అవుతుంది..ఇలా నెలకు ఐదుసార్ల వరకు డేటా లోన్ తీసుకునే అవకాశం కల్పించింది..

Spread the love