Recent Posts

JEE మెయిన్ 2021 ఏప్రిల్ సెషన్ వాయిదా-NTA

అమరావతి: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కొద్దిసేపటి కిందటే ఓ కీలక ప్రకటన విడుదల చేస్తు,,JEE మెయిన్ 2021 ఏప్రిల్ సెషన్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది..షెడ్యూల్ ప్రకారం JEE మెయిన్ ఏప్రిల్ సెషన్ ఈ నెల 27,28,30 తేదీల్లో నిర్వహించాల్సి ఉంది..కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు NTA స్పష్టం చేసింది..ఈ మూడు రోజుల సెషన్‌ను ఎప్పుడు నిర్వహించాలనే విషయాన్ని తరువాత వెల్లడిస్తామని పేర్కొంది..పరీక్షలు ప్రారంభం కావడానికి కనీసం 15 రోజుల ముందు ఆ సెషన్స్ తేదీలను ప్రకటిస్తామని తెలిపింది..అభ్యర్థులు పరీక్షలకు సిద్ధం కావడానికి అవసరమైన మెటీరియల్‌ ఎన్టీఏ యాప్ NTA Abhyas Appలో అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది.. ఫుల్ లెంగ్త్/చాఫ్టర్ వారీగా టెస్ట్ ప్రాక్టీస్ పేపర్లు ఆ యాప్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపింది..

Spread the love