Recent Posts

హిందూ దేవతల పురాతన విగ్రహాల స్మగ్లర్ జావేద్ షా అరెస్ట్

అమరావతి:  హిందూ దేవతల పురాతన విగ్రహాలను అక్రమంగా సేకరించి వాటిని స్మగ్లింగ్ ద్వారా అంతర్జాతీయ మార్కెట్లో అమ్మి కోట్ల రూపాయలను సంపాదిస్తున్నకాశ్మీర్ కు చెందిన జావేద్ షాను తమినాడు పోలీసులు అరెస్ట్ చేశారు..గత కొంత కాలంగా తమిళనాడులోని పర్యాటక ప్రాంతం మామల్లాపురంలో “ఇండియన్ కాటేజ్ ఎంపోరియం” పేరుతో విగ్రహాల దుకాణం నిర్వహిస్తున్నట్టు పోలీసులు తెలిపారు..అత్యంత అరుదైన పార్వతిమాత విగ్రహం జావేద్ వద్ద ఉందని,తమిళనాడు డీజీపీ శైలేంద్ర బాబుకు అందిన విశ్వనీయ సమాచారంతో,జావేద్ షాకు చెందిన “ఇండియన్ కాటేజ్ ఎంపోరియం”పై మంగళవారం నాడు దాడులు నిర్వహించగా..ఆ విగ్రహం లభించలేదు.తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అత్యంత విలువైన 11 పురాతన విగ్రహాలు లభించాయి.వీటిలో గణేశుడు, కృష్ణుడు, పది తలల రావణాసురుడి విగ్రహాలు సహా ఎనిమిది అత్యంత విలువైన విగ్రహాలు ఉన్నాయి..అయితే పార్వతి దేవి విగ్రహం కోసం బుధవారం నాడు మరోసారి తనిఖీలు చేపట్టగా,,అమ్మవారి విగ్రహం లభించింది.స్వాధీనం చేసుకున్న విగ్రహాల విలువ బహిరంగ మార్కెట్లో రూ.35-40 కోట్లు ఉంటుందని అంచనా…

    కాశ్మీర్:-కు చెందిన జావేద్ షా గత కొన్నేళ్లుగా చెన్నైలో స్థిరపడ్డాడు.అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠాతో అత్యంత దగ్గరి సంబంధాలు కలిగిన జావేద్.. భారత్ నుంచి పురాతన విగ్రహాల తరలిస్తున్న ముఠాలో కింగ్ మేకర్ అని పోలీసులు తెలిపారు..ఇతడి ఆధ్వర్యంలో అనేక విలువైన పురాతన విగ్రహాలు భారత్ నుంచి తరలివెళ్ళిపోయినట్లు,,తమిళనాడు విగ్రహాల అక్రమ రవాణా నిరోధక విభాగం ఏడీజీపీ జయంత్ మురళి తెలిపారు.విగ్రహాల అక్రమ రవాణాలో ఆరితేరిన జావేద్ షాను విచారిస్తే అంతర్జాతీయంగా ఉన్న ముఠాసభ్యులను వెలుగులోకి తేవచ్చని అధికారులు భావిస్తున్నారు..

Spread the love
error: Content is protected !!