Recent Posts

నిరుద్యోగులు ఆందోళనలకు జనసేన మద్దతు-పవన్

హైదరాబాద్: ఏ.పి ప్రభుత్వం ప్రకటించిన జాబ్‌ క్యాలెండర్‌ నిరసిస్తు నిరుద్యోగులు ఆందోళనలు చేస్తున్నారు..వీరి ఆందోళనకు పలు ప్రజాసంఘాలు మద్దతు ఇస్తుండగా,ఇప్పుడు జనసేన పార్టీ కూడా రంగంలోకి దిగింది.. నిరుద్యోగులకు అండగా జనసేన పోరాటం చేస్తుందని జనసేనాని పవన్ కల్యాణ్‌ ప్రకటించారు..ఈ నెల 20న అన్ని జిల్లాల్లోని ఎంప్లాయ్‌మెంట్‌ అధికారులకు వినతిపత్రాలు ఇవ్వాలని సూచించారు..అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను జాబ్‌ క్యాలెండర్‌లో చేర్చాలని డిమాండ్‌ చేసిన జనసేన అధినేత,,లక్షల్లో ఉద్యోగాలు కల్పిస్తామని వైసీపీ హామీ ఇచ్చిందని, సుమారు 30 లక్షల మంది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారన్నారు..ఇక, ఏపీపీఎస్సీ ద్వారా 2.3 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని,హమీ ఇచ్చి నేడు జాబ్‌ క్యాలెండర్‌లో కేవలం 10 వేల ఉద్యోగాలను మాత్రమే చేర్చారని,, గ్రూప్-1, గ్రూప్-2 విభాగాల్లో కేవలం 36 ఖాళీలను మాత్రమే చూపారని ఆవేదన వ్యక్తం చేశారు.. నిరుద్యోగుల ఆందోళనకు జనసేన పార్టీ బాసటగా ఉంటుందని భరోసా ఇచ్చారు..

Spread the love