AMARAVATHI

రాజకీయాల్లో పనికిరాని వ్యక్తి జగన్- పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారు-చంద్రబాబు

అమరావతి: గడిచిన 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును నాశనం చేసిందని సీఎం చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు.. సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం చంద్రబాబు,, మీడియాతో మాట్లాడారు..రాజకీయాల్లో పనికిరాని వ్యక్తి జగన్,అలాంటి వ్యక్తి అధికారంలోకి రావడం రాష్ట్రానికి శాపంగా మారారన్నారు..వైసీపీ ప్రభుత్వం రాగానే పోలవరంపై రివర్స్ టెండరింగ్ చేపట్టారని, ఏజెన్సీతోపాటు సిబ్బందిని కూడా మార్చారన్నారు.. గత ప్రభుత్వ నిర్ల్యక్షంతో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని ఆరోపించారు.. రూ.447 కోట్లతో మరమ్మతులు చేసినా డయాఫ్రమ్ వాల్ పూర్తి స్థాయిలో బాగవుతుందనే పరిస్థితి లేదన్నారు.. సమాంతరంగా డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తే రూ.990 కోట్లు ఖర్చవుతుందన్నారు.. పోలవరం విషయంలో జగన్ క్షమించరాని తప్పులు చేశారని చంద్రబాబు మండిపడ్డారు..

వరదలు వస్తే మరింత నష్టం:- పోలవరం డయాఫ్రం వాల్ దెబ్బతిందని సీఎం చంద్రబాబు తెలిపారు..కాపర్ డ్యాం పూర్తిగా నిర్మించకపోవడంతో వరద తాకిడికి డయాఫ్రం వాల్ దెబ్బతిందన్నారు.. దానికి సమాంతరంగా మరొక డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తే రూ.447 కోట్లు అదనపు ఖర్చు అవుతుందన్నారు.. దీంతో మొత్తం వ్యయం రూ.990 కోట్లకు చేరుతుందన్నారు.. రెండు కాపర్ డ్యామ్‌లకు రూ.550 కోట్లు, రూ.2 వేల కోట్లు కాపర్ డ్యాం గ్యాప్ నిర్మాణానికి ఖర్చు అవుతుందని చంద్రబాబు తెలిపారు..ప్రాజెక్టు పూర్తి కావాలంటే మరో 4 ఏళ్లు పడుతుందని చంద్రబాబు తెలిపారు.. కాపర్ డ్యాం సీపేజీలు ఉన్నాయని, వరదలు వస్తే మరింత నష్టం జరుగుతుందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల పోలవరం ప్రాజెక్టు చాలా నష్టం జరిగిందని ఆరోపించారు.

జగన్ రాజకీయాలకు పనికిరాని వ్యక్తి:- జగన్ రాజకీయాల్లో ఉండ తగని వ్యక్తి అని సీఎం చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు..జగన్ క్షమించరాని నేరం చేశారని,, 2014లో రాష్ట్రం కోసం తాను పడిన కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేశారని అగ్రహాం వ్యక్త చేశారు.. పోలవరం డ్యామ్ ఎత్తు 45.72 మీటర్ల ఎత్తు ఉంటే 194 టీఎంసీల నీరు నిల్వ ఉంటుందని,, ఆ ఎత్తును తగ్గించడానికి గత ప్రభుత్వం ప్రయత్నించిందన్నారు.. స్పిల్ వే ద్వారా 50 లక్షల క్యూసెక్కుల నీరు వెళ్లేలా డిజైన్ చేశామన్నారు.. చైనాలో త్రీ గార్జియస్ ప్రాజెక్టు ద్వారా మాత్రమే అంత ఎక్కువ వాటర్ డిశ్ఛార్జ్ అవుతోందని గుర్తుచేశారు.

Spread the love
venkat seelam

Recent Posts

రూ.10,20 నాణేలను తిరస్కరిస్తే చట్ట ప్రకారం నేరం-ఉత్తర్వులు జారీ చేసిన రిజర్వ్ బ్యాంకు

IPC సెక్షన్ 124A... అమరావతి: ప్రభుత్వం గుర్తించిన 10 లేక 20 రూపాయల నాణేలను తిరస్కరిస్తే చట్ట ప్రకారం నేరం…

5 hours ago

ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లను పెంచి అందించాం-మంత్రి నారాయణ

నెల్లూరు: ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన మాట ప్రకారం గతంలో ఇస్తున్నరూ.3వేలు పింఛన్‌కు రూ.వెయ్యి పెంచి రూ.4వేలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అందించారని,…

5 hours ago

నెల్లూరు గవర్నమెంట్ డాక్టరు జ్యోతిది ఆత్మహత్యేనా ?

డాక్టరు జ్యోతి మరణం వెనుక వున్న కారణం ఏమిటి అనే “నిజం” పోస్టుమార్టం తరువాత వెలుగులోకి వస్తుందా ? లేక…

6 hours ago

ఒక్క రూపాయి జీతం తీసుకోకుండా పనిచేస్తాను-పవన్ కళ్యాణ్

అమరావతి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలులో సోమవారం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో…

7 hours ago

జిల్లా వ్యాప్తంగా పింఛన్ల పంపిణీలో పాల్గొన్న 8,500 ఉద్యోగులు-మంత్రి నారాయణ

జిల్లాలో 313757మంది లబ్ధిదారులకు రూ. 214.50 కోట్లు.. నెల్లూరు: రాష్ట్రవ్యాప్తంగా సోమవారం తెల్లవారుజామున నుంచి సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం…

1 day ago

రాజకీయ నేతల గుప్పెట్లో క్రీడా సంఘాలు బందీ అయ్యాయి-క్రీడాకారులు

పవన్ కల్యాణ్ హామీ.. అమరావతి: గత వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్‌లోని అన్నీ రంగాలూ అథోగతి పాలయ్యాయని, అలాగే క్రీడారంగం సైతం…

1 day ago

This website uses cookies.