Recent Posts

దేశంలో తయారు చేస్తున్న చైనా మొబైల్ కంపెనీలపై ఐటీ రైడ్స్

కోట్లల్లో పన్ను ఎగవేత..

అమరావతి: భారత్‌లో వ్యాపారం చేస్తున్న అనేక చైనా మొబైల్ తయారీ కంపెనీలపై ఇన్‌కమ్‌ ట్యాక్స్ (ఐటీ) అధికారులు దాడులు నిర్వహించారు..సదరు కంపెనీలు భారీ పన్ను ఎగ్గొట్టినట్లు విశ్వనీయ సమాచారం అందడంతో రెండ్రోజుల పాటు సుదీర్ఘంగా రైడ్స్ సాగాయని న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.ఒప్పో, షియోమీ, వన్‌ ప్లస్ సహా పలు మొబైల్ తయారీ కంపెనీలకు సంబంధించి ఢిల్లీ, ముంబై, బెంగళూరు, గ్రేటర్‌‌ నోయిడా, కోల్‌కతా, గౌహతి, ఇండోర్, తమిళనాడులో పెరుంగుడి, కాంచీపురంలలో ఒకేసారి ఈ దాడులు నిర్వహించారు..ఈ కంపెనీల తయారీ యూనిట్లు, గోడౌన్లు, కార్పొరేట్ ఆఫీసులు, సీఈవో కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేసి పన్ను ఎగవేతలకు సంబంధించి కంప్యూటర్లు, హార్డ్‌ డిస్కులను సీజ్‌ చేశారని సమాచారం. సీఈవోలను ఐటీ అధికారులు ఇంటరాగేషన్‌ కూడా చేశారని ఏజెన్సీ పేర్కొంది. మొబైల్ తయారీ కంపెనీలతో పాటు కొన్ని ఫిన్ టెక్‌ కంపెనీలపైనా ఈ రైడ్స్ జరిగాయని వెల్లడించింది..భారత్‌లో పని చేస్తున్న చైనా కంపెనీలపై ఐటీ రైడ్స్ జరగడం ఇదే తొలిసారి కాదు..ఆగస్టులోనే చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మొబైల్ కంపెనీ ZTE ఆఫీసుల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు.. దేశంలో ఉన్న కంపెనీ కార్పొరేట్ ఆఫీస్, మొబైల్ తయారీ యూనిట్స్, ఆ సంస్థ ఫారెన్ డైరెక్టర్ ఇల్లు, కంపెనీ సెక్రెటరీ ఇల్లు, అకౌంట్స్ సిబ్బంది ఇళ్లలోనూ నాడు రైడ్స్ జరిగాయి. ఆ సమయంలో ఇంపోర్ట్ బిల్స్, సేల్స్ బిల్స్ పరిశీలించగా, కంపెనీకి 30 శాతం లాభం వచ్చినట్లు తేలింది.. అయితే కంపెనీ మాత్రం చాలా సంవత్సరాలుగా నష్టాల్లోనే ఉన్నట్లు తప్పుడు లెక్కలు చూపిస్తూ వస్తోంది. ఖర్చుల్లో బోగస్ లెక్కలు చూపించి,,ఆ నష్టాలను లెక్కల్లో రాసినట్లు ఐటీ అధికారుల ఇన్వెస్టిగేషన్‌లో తేలింది.కొన్ని చోట్ల సర్వీస్‌ చేసినట్లు చూపించిన బిల్లులను పరిశీలించగా.. అవన్నీ ఫేక్ అడ్రస్‌లని తేలినట్లు నాడు ఐటీ డిపార్ట్‌మెంట్ పేర్కొంది.

Spread the love
error: Content is protected !!