అమరావతి: బుధవారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడి ఉన్న’అసని’ తుఫాను సాయంత్రానికి తీవ్ర వాయుగుండముగా మారి మచిలీపట్టణం,నర్సాపూర్ కి మధ్య తీరం దాటి గురవారం 8.30 గంటల సమయానికి మరింత బలహీనపడి వాయుగుండంగా మారి,తరువాత తీవ్ర అల్పపీడనంగా మారిందని భారత వాతావరణ శాఖ సంచాలకులు తెలిపారు..దానికి అనుబంధంగా ఒక ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టం నుండి 7.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకి వెళ్లేకొద్దీ నైరుతి దిశగా వంగి ఉందని,, రాబోయే 12 గంటలలోఇది మరింత బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందన్నారు..వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ ఇలా వుంటుందని పేర్కొన్నారు..
ఉత్తర కోస్త,,యానాం,,దక్షిణ కోస్తా ఆంధ్ర,,రాయలసీమ:-గురువారం తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది.ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల ఏర్పడే అవకాశము ఉంది.శుక్రవారం తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల ఏర్పడే అవకాశము ఉంది..శనివారం తేలిక పాటి నుండి ఒక మోస్తరువర్షాలు ఒకటి లేదా చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.