Recent Posts

మంత్రి ఈటెల.రాజేంద్ర భూములు కబ్జా చేసింది వాస్తవమే-కలెక్టర్

హైదరాబాద్: తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల.రాజేంద్రకు రాజకీయ కష్టాలు ప్రారంభంమైనట్లు కన్పిస్తుంది…ఈటెల,,మెదక్ జిల్లా అచ్చంపేటలో అసైన్డ్ భూముల కబ్జా చేసిన మాట వాస్తవమే అని మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు..భూముల కబ్జాపై నాలుగు గంటల్లో ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని,, బాధితులతో మాట్లాడి పూర్తి వివరాలు సేకరిస్తున్నామన్నారు..అసైన్డ్ భూములు కబ్జా చేశారని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు.. ఉదయం నుంచి విచారణ జరుగుతుందని,,మధ్యాహ్నం వరకు ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు..అసైన్డ్ భూముల్ని లాక్కోవడం చట్టరిత్యా నేరమన్నారు..అచ్చంపేటలో తుప్రాన్‌ ఆర్డీవో రాంప్రకాశ్‌ ఆధ్వర్యంలో ఆరు ప్రత్యేక బృందాలు ఈ సర్వే చేస్తున్నాయన్నారు.. ఈటలకు చెందిన హేచరీస్‌లో డిజిటల్‌ సర్వే కొనసాగుతోంది..దీంతో పాటు హేచరీస్‌కు పక్కన ఉన్న అసైన్డ్‌ భూముల్లోనూ అధికారులు డిజిటల్‌ సర్వే చేస్తున్నారు.. మంత్రిపై ఫిర్యాదు చేసిన రైతుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.. అసైన్డ్‌దారులను ఒక్కొక్కరిగా పిలిచి విచారిస్తున్నారు..(మంత్రి ఈటల రాజేందర్‌ తమ అసైన్డ్‌ భూములను కబ్జా చేశారని అచ్చంపేటకు చెందిన పలువురు రైతులు సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు..దీంతో రైతుల ఫిర్యాదుపై స్పందించిన సీఎం సమగ్ర విచారణకు ఆదేశించారు..ఈ క్రమంలో మంత్రి భూ వివాదంపై అధికారులు అచ్చంపేటలో విచారణ చేపట్టారు.)

Spread the love