Recent Posts

జనవరి 10వ తేదీ స్థానికులకు వైకుంఠ ద్వార దర్శనం ఉచిత దర్శనం టికెట్ల జారీ-టీటీడీ

భక్తులు కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి..

తిరుపతి: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనం కోసం జనవరి10వ తేదీ ఉదయం 9 గంటలకు తిరుపతిలో సర్వదర్శనం టికెట్లు జారీ చేస్తామని టీటీడీ అదనపు ఈవో ఎ వి ధర్మారెడ్డి తెలిపారు..తిరుపతి లోని రామచంద్రపుష్కరిణి, ముత్యాలరెడ్డి పల్లె, సత్యనారాయణ పురం జిల్లా పరిషత్ పాఠశాలలు, బైరాగి పట్టెడ రామానాయుడు పాఠశాల, మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న కౌంటర్లను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైకుంఠ ద్వార దర్శనం కోసం (తిరుపతి) స్థానికులకు మాత్రమే ఈ నెల 13 నుంచి 22 వ తేదీ వరకు రోజుకు 5 వేల టికెట్ల చొప్పున 50 వేల సర్వదర్శనం టికెట్లు జారీ చేస్తామన్నారు. టికెట్ల కోసం వచ్చే భక్తులు క్యూ లో కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. టికెట్లు పొందిన భక్తులు ముందురోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి మాత్రమే అలిపిరి నుంచి తిరుమలకు అనుమతిస్తామని చెప్పారు.

Spread the love
error: Content is protected !!