అమరావతి: నెల్లూరు జిల్లాలో రాజకీయంగా చక్రం తిప్పుతున్న ఆనం కుటుంబం,,ఆనం వివేక మరణించడం,,అలాగే ఇటీవల చోటుచేసుకున్న పరిస్థితుల కారణంగా రాజకీయంగా పట్టు కోల్పోతుంది..ఎలాగైన తమ వారసులకు రాజకీయ బాట ఏర్పాటు చేయాలన్న తలంపుతో,,ఎమ్మెల్యే ఆనం.రామనారాయణరెడ్డి కుమార్తె కైవల్యా రెడ్డి శనివారం ఒంగొలులో జరుగుతున్న టీడీపీ మహానాడును వేదికగా చేసుకున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు..ఈ నేపధ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో.. కైవల్యా రెడ్డి ప్రత్యేకంగా సమావేశం అయ్యారు..భేటీ సందర్బంగా పలు కీలక విషయాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం..నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి టీడీపీ తరఫున పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని లోకేష్‌కు ఆమె చెప్పినట్లు భోగట్టా.. లోకేష్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే టీడీపీ కండువా కప్పుకోవాలని కైవల్యారెడ్డి భావిస్తున్నట్లు విశ్వానీయా సమాచారం..మరి ఎటువంటి పరిమాణాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే…?
More Stories
భవన నిర్మాణాలకు సంబంధించి సిమెంట్ బిల్లులను త్వరగా మంజూరు కు చర్యలు-కలెక్టర్
అవిశ్వాస తీర్మానం విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదు-షిండే
సచివాలయ సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి-కలెక్టర్