Recent Posts

11వ తేది రాత్రి నుంచి 12వ తేది ఉదయం వరకు ఆన్‌లైన్ సేవలకు అంతరాయం-SBI

అమరావతి: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) డిసెంబర్ 11, 12 తేదీల్లో 5 గంటలు ఆన్‌లైన్,, నెట్ బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగనున్నట్లు తెలిపింది..డిశంబరు 11వ తేది రాత్రి 23:30 గంటల నుంచి 12వ తేది డిసెంబర్ 04:30 గంటల (120 నిమిషాలు) మధ్య కాలంలో చేపట్టే మెయింటెనెన్స్‌ కారణంగా ఆన్‌లైన్ నెట్ బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగనున్నట్లు పేర్కొంది..ఖాతాదారులకు మెరుగైన బ్యాంకింగ్ సౌకర్యాలను అంధించడం కోసం కృషి చేస్తున్నట్లు బ్యాంకు తెలియచేసింది..ఈ సమయంలో ఎస్‌బీఐ ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, యోనో యాప్‌, యోనో లైట్‌, యోనో బిజినెస్‌, ఐఎంపీఎస్‌, యూపీఐ సర్వీసులేవీ పని చేయవని పేర్కొంది..మీకు జరిగే అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము” అని SBI తెలిపింది.

Spread the love
error: Content is protected !!