Recent Posts

సోమవారం నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు నిర్వహించుకోవచ్చు-కోర్టు

హైదరాబాద్: ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను రద్దు చేయాలంటూ పేరేంట్స్ అసోసియేషన్ పిటిషన్ పై హైకోర్టు అత్యవసర విచారణ జరిపింది.అక్టోబర్ 25 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతున్న సమయంలో,ఇప్పుడు పిటిషన్ వేస్తే ఎలా? అని కోర్టు ప్రశ్నించింది.చివరి నిమిషంలో జోక్యం చేసుకోలేమని,బోర్డు పరీక్షలు నిర్వహించుకోవచ్చని తెలిపింది.కోర్టు సూచనలతో పేరేంట్స్ అసోసియేషన్ పిటిషన్ ఉపసంహరించుకుంది.దీంతో అక్టోబర్ 25వ తేది నుంచి జూనియర్ ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి.ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులను సెకండియర్ కు పంపుతున్నట్లు గతంలోనే ప్రభుత్వం ప్రకటించింది.ఈ నిర్ణయం తర్వాత విద్యార్థులంతా రెండో సంవత్సరం పాఠాలు చదువుకుంటున్నారని,ఇలాంటి సమయంలో మళ్లీ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తే వారు గందరగోళంలో పడిపోతారని” తల్లిదండ్రుల తరఫు న్యాయవాది వాదించారు..ఇందుకు ఇంటర్‌ బోర్డు తరఫు న్యాయవాది వాదనలు విన్పిస్తు, విద్యార్థులు కరోనా కారణంగా పదో తరగతి పరీక్షలు కూడా రాయలేదని, వచ్చే ఏడాది కూడా ఏవైనా అవాంతరాలు వచ్చి ఇంటర్ సెకండియర్ పరీక్షలు కూడా రాయలేకపోతే ఈ విద్యార్థుల నైపుణ్యాలను ఎలా పరిగణించాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుందని కోర్టుకు వివరించారు..అలాగే విద్యార్థులను సెకండియర్ కు ప్రమోట్ చేసినప్పుడే పరిస్థితులను బట్టి మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తామని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.ఇరువర్గాల వాదనలూ విన్న హైకోర్టు చివరి నిమిషంలో పరీక్షల నిర్వహణలో తాము జోక్యం చేసుకోవడం కుదరదని స్పష్టం చేసింది.పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ ఇప్పటికే దాదాపు పూర్తయిన నేపథ్యంలో ఈ పిటిషన్‌ వల్ల విద్యార్థులు పరీక్షలు జరుగుతాయా? లేదా? అనే అయోమయంలో పడతారని వ్యాఖ్యానించింది.కాబట్టి పిటిషన్‌ వెనక్కు తీసుకోవాలని పిటిషనర్‌కు సూచించింది.శుక్రవారం హైకోర్టులో విచారణ చేపట్టాల్సిన పిటిషన్ల జాబితాలో ఈ పిటిషన్‌ లేదు. దీంతో దీనిపై అత్యవసర విచారణ చేపట్టాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోరారు. దీనికి అంగీకరించిన న్యాయస్థానం అత్యవసరంగా ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది.శని, ఆదివారాలు కోర్టుకు సెలవు కాగా, సోమవారం ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల 58 మంది విద్యార్థులకు పరీక్షలు రాయనున్నారు.

Spread the love
error: Content is protected !!