Recent Posts

మే 5వ తేది నుంచి 23వ తేది వరకు ఇంటర్ పరీక్షలు-మంత్రి అదిమూలపు

అమరావతి: ఇంటర్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారం మే 5వ తేది నుంచి 23వ తేది వరకు నిర్వహిస్తామని  విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు..అన్ని జిల్లాల్లో అధికారులు కోవిడ్-19 పరిస్థితులను దృష్టిలో వుంచుకుని జాగ్రత్తలతో పరీక్షల నిర్వహణకు సిద్ధం కావాలని,,ఇంటర్మీడియట్ పరీక్షలు అనివార్యం అని గుర్తించాలన్నారు..ఏ రాష్ట్రంలో కూడా ఇంటర్ పరిక్షలు రద్దు కాలేదని,,కొన్నిచోట్ల నిర్వహిస్తుండగా మరికొన్ని చోట్ల వాయిదా వేశారని గుర్తు చేశారు..కొన్ని రాజకీయ పార్టీలు దీనిని అనవసరంగా రాద్ధాంతం చేస్తూ విద్యార్థులు,, తల్లిదండ్రుల మానసిక ధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు..ఇంటర్ ప్రాక్టీకల్ పరీక్షలు ఇప్పటికే పూర్తి చేసినందుకు అధికారులకు అభినందనలన్నారు..వైద్య శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చూడాలన్నారు..అన్ని సెంటర్ లపై నిఘా ఉంచి ప్రతి రోజు పరిస్థితులపై సమీక్షిస్తానని,,విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధవంతంగా అమలు చేసెందుకు అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని కోరారు..

Spread the love