Recent Posts

ఈ నెల 15 నుండి 23 వరకు జిల్లా వ్యాప్తంగా 90 కేంద్రాలలో ఇంటర్ పరీక్షలు-జె.సి గణేష్

నెల్లూరు: ఈ నెల 15 నుండి 23 వరకు జిల్లా వ్యాప్తంగా 90 కేంద్రాలలో ఇంటర్ పరీక్షలు నిర్వహించ బడుతాయని,కోవిడ్ నిబంధనలను అనుసరించి పరీక్ష రాయాలనే విధ్యార్ధులు హాజరు కావాలని జిల్లా జాయింట్ కలెక్టర్-II(డెవలప్మెంట్)  జీ.గణేష్ కుమార్ అన్నారు. బుధవారం పరీక్షల ఏర్పాట్ల గురించి వివిధ శాఖల అధికారులతో సమావేశం అయ్యారు. ఈ సంధర్భంగా జాయింట్ కలెక్టర్-II ( డెవలప్మెంట్) మాట్లాడుతూ ఇంటర్ మీడియెట్ బోర్డు సెక్రెటరీ ఆదేశాల ప్రకారం ఈ నెల 15 నుంచి ఉదయం పూట ఇంటర్ మొదటి సంవత్సరం వారికి మధ్యాహ్నం పూట రెండవ సంవత్సరం వారికి పరీక్షలు నిర్వహించబడుతాయన్నారు. ఉదయం పూట పరీక్షలు మొదటి సంవత్సరం వారికి 9 గంటల నుండి 12 వరకు, మధ్యాహ్నం ఇంటర్ రెండవ సంవత్సరం వారికి 2.30 గం నుండి 5.30 గం వరకు నిర్వహించబడుతుందన్నారు. అదే విధంగా ప్రాక్టికల్ పరీక్షలు అక్టోబర్ 4వ తేది నుండి 7వ తేది వరకు నిర్వహించబాదుతాయన్నారు.ఎథిక్స్, హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష 27వ తేదీన ఉదయం 10 నుండి 1 గం వరకు నిర్వహించబడుతుందని, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ 28 వ తేదీన 10 గం నుండి 1 గం వరకు నిర్వహించబడుతాయన్నారు. 90 కేంద్రాలలో నిర్వహించబడే ఈ పరీక్షలకు సంబందించిన మెటీరియల్స్ 11, 12,13 వ తేదీలలో ఆయా పరీక్షా కేంద్రాలకు మూడు సెట్లుగా పంపడం జరుగుతుందని, పరీక్షా సమయానికి గంట ముందే ఆయా పోలీసు స్టేషన్ ల నుండి నిర్ణయించిన సెట్ కు సంబందించిన ప్రశ్నా పత్రాలను తీసుకెళ్తారన్నారు.

Spread the love