Recent Posts

ప్రపంచ సుందరీగా భారత అందాల సుందరీ సంధు

అమరావతి: ఇజ్రాయెల్ లో జరిగిన మిస్ యూనివర్స్-2021  పోటీల్లో ఈ సంవత్సరం మిస్ యూనివర్స్ కిరీటాన్ని భారత్‌కు చెందిన హర్నాజ్‌ కౌర్‌ సంధు గెలుచుకుంది..ఈ కిరీటం కోసం ఫైనల్లో అందాల భామ దివా మిస్ పరాగ్వే  మిస్ సౌత్ ఆఫ్రికాతో తలపడింది..అమె ఇచ్చిన జవాబుతో ఆధిక్యాన్ని సంపాదించి ఈ ఏడాది మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకుంది.మరోసారి భారత్‌కు మిస్ యూనివర్స్ కిరీటాన్ని సాధించిపెట్టింది..ఈ పోటీల్లో పరాగ్వేకు చెందిన నదియా ఫెరీరా ఫస్ట్ రన్నరప్‌గా నిలవగా,,దక్షిణాఫ్రికాకు చెందిన లాలెలా మస్వానే సెకండ్ రన్నరప్‌గా నిలిచారు.

     హర్నాజ్ కి కిరీటాన్ని అందించడానికి అడిగిన ప్రశ్న వాతావరణ మార్పు ఒక బూటకమని అంటుంటారు..ఇందుకు మీ సమాధానం ఏమిటి అని న్యాయనిర్ణేతలు ప్రశించగా,,హర్నాజ్ సమాధానం చెబుతూ.. ప్రకృతిలో చాలా సమస్యలున్నాయని తెలిసి,,తన గుండె పగిలిపోతోందన్నారు..ఇదంతా మానవుల బాధ్యతారాహిత్యం వల్లే జరుగుతోందనే అభిప్రాయం వ్యక్తం చేశారు..మనం చేసే ప్రతి చర్య ప్రకృతిని రక్షించగలదని  సమాధానం చెప్పింది. అనంతరం విశ్వసుందరిగా ఆమె పేరు చెప్పగానే ఉద్వేగానికి గురిఅయ్యారు..70వ మిస్ యూనివర్స్ 2021 పోటీల్లో ఈ టైటిల్‌ను గెలుచుకున్న భారతదేశపు మూడవ బ్యూటీ హర్నాజ్‌ కౌర్‌ సంధు..

Spread the love
error: Content is protected !!