Recent Posts

పారాఒలింపిక్స్‌లో 3 పతకాలు సాధించిన భారత అథ్లెట్లు

అమరావతిం పారాఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు పతకాల వేల కొనసాగిస్తున్నారు.5వ రోజైన ఆదివారం భారత్ ఖాతాలో మూడు పతకాలు చేరాయి.ఉదయం టేబుల్ టెన్నిస్‌లో భారత క్రీడాకారిణి భవీనా పటేల్ రజతం సాధించి దేశానికి తొలి పతకాన్ని అందించింది.పురుషల హై జంప్‌లో అమెరికా అథ్లెట్ అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం కైవసం చేసుకోగా, రెండో స్థానంలో నిలిచిన నిషాద్‌కు రజతం దక్కింది.డిస్కస్ త్రోలో వినోద్ కుమార్ కాంస్య పతకం సాధించి రికార్డుల్లోకి ఎక్కేడు.మరో పతకం సాధిస్తే 2016 రియో గేమ్స్ మెడల్ రికార్డు సమమవుతుంది.భారత్‌ సొంతమైన మూడు పతకాలు నేడే రావడం,జాతీయ క్రీడా దినోత్సవం రోజునే క్రీడకారులు పతకాలు సాధించడం విశేషం..

Spread the love