Recent Posts

ఆసియన్ చాంపియన్స్ ట్రోపీ హాకీలో పాక్‌ను మట్టికరిపించి సెమీస్‌‌కు చేరుకున్న భారత్

అమరావతి: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరుగుతున్నఆసియన్ చాంపియన్స్ ట్రోపీ హాకీ 20211లో భారత్ పాక్ ను ఓడించి సెమీఫైనల్స్ కు దూసుకుని పోయింది..శుక్రవారం జరిగిన రౌండ్ రాబిన్ పోటీల్లో పాక్‌ను3-1తో భారత్ మట్టికరిపించింది..2018లో మస్కట్‌లో జరిగిన టోర్నీ ఫైనల్,వర్షం కారణంగా రద్దుకావడంతో ఇరు జట్లు టోర్నీని పంచుకున్నాయి..మూడు సంవత్సరాల తరువాత నేడు ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి.. హాకీ చాంపియన్స్ ట్రోఫీలో భారత్‌‌పై పాక్‌దే పైచేయిగా ఉంది..రెండు జట్లు ఇప్పటి వరకు 9సార్లు తలపడగా,7సార్లు పాక్, 2 సార్లు భారత్ విజయం సాధించాయి..నేటి మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయం సాధించింది..

Spread the love
error: Content is protected !!