Recent Posts

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సేవలకు అగష్టు 1 నుంచి ఛార్జీలు

అమరావతి: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఇంత వరకు ఖాతాదారులకు ఉచితంగా అందిస్తున్నడోర్ స్టెప్ సేవలకు ఇక నుంచి ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. డోర్ స్టెప్ బ్యాంకింగ్ ఛార్జీలను, సేవింగ్స్ అకౌంట్ల వడ్డీ రేట్లను IPPB సవరించింది..ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ డోర్ స్టెప్ బ్యాంకింగ్ ఛార్జీలు 01 ఆగస్టు 2021 నుంచి వర్తిస్తాయి. ప్రస్తుతం, డోర్ స్టెప్ బ్యాంకింగ్ సంబంధించి ఎలాంటి ఛార్జీలు లేవు.ఆగస్టు 1, 2021 నుంచి ప్రతి కస్టమర్ IPPB డోర్ స్టెప్ అభ్యర్థనకు బ్యాంకింగ్ ఛార్జీల కింద రూ.20 చెల్లించాల్సి ఉంటుంది.అలాగే ఛార్జీలతో పాటు పొదుపు ఖాతాల వడ్డీ రేట్లను కూడా IPPB సవరించింది. ఈ కొత్త వడ్డీ రేట్లు జులై 1 నుంచి వర్తిస్తాయి.వడ్డీ రేట్లు ఖాతా బ్యాలెన్స్ పై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం లక్ష రూపాయల వరకు బ్యాలెన్స్ ఉంటే 2.75 శాతం అందిస్తుండగా, ఇక 2021 జూలై 1 నుంచి ఏడాదికి 2.5 శాతం అందించనున్నారు. అలాగే, రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు బ్యాలెన్స్ ఉంటే ఏడాదికి 2.75 శాతం వడ్డీ ఖాతాదారులకు లభిస్తుంది. పోస్టాఫీస్‌ ఖాతాదారులు వారి బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం, మనీ ట్రాన్స్‌ ఫర్ సర్వీసుల కోసం, ఇతర ఆర్థిక సేవలను ఇప్పుడు IPPB App ద్వారానే పొందవచ్చు. ఈ సేవల కోసం పోస్టాఫీస్ బ్రాంచుకు వెళ్లాల్సిన అవసరం లేదు..

Spread the love