AMARAVATHINATIONAL

భారత్ విశ్వగురు మాత్రమే కాదు,ప్రపంచ యోగా గురువు-ప్రధాని మోదీ

అమరావతి: భారత్ విశ్వగురు మాత్రమే కాదని,,ప్రపంచ యోగా గురువుగా భారత్‌ మారిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు..శుక్రవారం శ్రీనగర్‌లోని దాల్‌ సరస్సు ఒడ్డున ఉన్న షేర్‌-ఏ-కశ్మీర్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌ వద్ద జరిగిన అంతర్జాతీయ యోగా దశాబ్ది వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, యోగా ప్రాముఖ్యత రోజురోజుకు పెరుగుతున్నదని,,యోగా సాధన వల్ల సకారాత్మక ఆలోచనలు వస్తాయని అలాగే ధ్యానంతో మన ఏకాగ్రత పెరుగుతుందన్నారు..జమ్ముకశ్మీర్‌లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో 50 వేల మంది పాల్గొన్నారన్నారు..శ్రీనగర్‌లో ఒక శక్తి ఉందని, యోగా ద్వారా దానిని మరింత పెంచుకోవచ్చన్నారు..

2014లో తొలిసారి తాను అంతర్జాతీయ యోగా దినోత్సవం గురించి ఐక్యరాజ్యసమితిలో ప్రతిపాదించానాని,, భారతదేశ ప్రతిపాదనకు 177 దేశాలు మద్దతిచ్చాయని చెప్పారు.. అప్పటి నుంచి యోగా దినోత్సవం సరికొత్త రికార్డులు సృష్టిస్తూనే ఉందన్నారు..విదేశాల్లో యోగా చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నదని,,యోగా నేర్పేందుకు వందల సంఖ్యలో సంస్థలు వెలిశాయన్నారు..జర్మనీలో ప్రస్తుతం కోటిన్నరమంది నిత్యం యోగా చేస్తున్నారని తెలిపారు..యోగా నేర్పే మహిళకు పద్మశ్రీ పురస్కారం కూడా దక్కిందన్నారు..మన దేశంలోని అనేక వర్సిటీలు యోగా కోర్సులు ప్రారంభించాయన్నారు..యోగా ప్రాముఖ్యత గురించి అనేక దేశాల నేతలు తనను అడిగారని వెల్లడించారు..యోగా సాధన వల్ల శారీరకంగా, మానసికంగా మార్పులు వస్తాయన్నారు..నేడు పదో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని కోరుతున్నానని తెలిపారు.. యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచం నలుమూలలా యోగా చేస్తున్న అందరికీ శుభాకాంక్షలు తెలిపారు..అంతకు ముందు ప్రజలతో కలిసి ప్రధాని యోగాసనాలు వేశారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *