Recent Posts

వ్యాక్సిన్‌ పంపిణీలో అరుదైన రికార్డుకు కోటీ డోసుల దూరంలో భారత్‌

అమరావతి: కరోనా వైరస్ ను నిరోధించేందుకు భారతదేశంలో వేగంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం యుద్దప్రతిపాదికన కేంద్రం చేపట్టింది..వ్యాక్సిన్‌ పంపిణీలో అరుదైన రికార్డుకు భారత్‌ కోటీ డోసుల దూరంలో ఉంది.దేశంలో ఇప్పటి వరకు 99 కోట్లకు పైగా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుక్‌ మాండవీయ ట్వీట్‌ చేశారు..బుధవారం నాటికి 1 00 కోట్ల డోసులు పూర్తి కానున్నాయి..అదే జరిగితే చైనా తర్వాత 100 కోట్ల డోసులు పంపిణీ చేసిన రెండో దేశంగా భారత్‌ అరుదైన గుర్తింపు సాధించనుంది..టీకా కార్యక్రమాన్ని ఈ సంవత్సరం జనవరిలో కేంద్రం ప్రారంభించింది. ప్రారంభమైన తొలిదశలో వ్యాక్సీన్ల కొరత,,నిల్వ సదుపాయాలు,రవాణా తదితర సమస్యలతో కొంత నిదానంగా సాగింది. కరోనా రెండో దశ దాటి తరువాత నుంచి వ్యాక్సీన్ల కార్యక్రమంలో వేగం పుంజుకుంది. టీకా పంపిణీలో ఉత్తరప్రదేశ్‌ 12కోట్లకు పైగా డోసులను పంపిణీ చేశారు.మహారాష్ట్ర 9 కోట్లకు డోసులను పూర్తి చేసింది.తరువాత స్థానాల్లో పశ్చిమబెంగాల్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, బిహార్‌, కర్ణాటక, రాజస్థాన్‌ ఉన్నాయి..వ్యాక్సినేషన్‌ 100 కోట్ల మార్క్‌ను దాటిన తరువాత ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం అవుతోంది..

Spread the love
error: Content is protected !!