Recent Posts

శ్రీ లంకను మరోసారి ఆర్దికంగా అదుకున్న భారత్

అమరావతి: చైనా కంత్రీ వద్ద ఆర్దిక రుణం తీసుకుని,వడ్డీలు కూడా కట్టలేక త్రీవ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో శ్రీలంకకు భారత ప్రభుత్వం మరోసారి ఆపన్న హస్తం అందించింది. పెట్రోలియం ఉత్పత్తులు కొనుక్కోవడం కోసం ఆ దేశానికి 500 మిలియన్ డాలర్లను అప్పుగా ఆఫర్ చేసినట్లు కొలంబోలోని ఇండియన్ హైకమిషన్ వెల్లడించింది. భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, శ్రీలంక ఆర్థిక శాఖ మంత్రి బసిల్ రాజపక్స మధ్య జరిగిన చర్చల ఫలితంగా ఈ నిర్ణయం వెలువడినట్లు పేర్కొంది.. ఇప్పటికే భారత్ ఈ నెల మొదట్లో శ్రీలంకకు 900 మిలియన్ డాలర్ల ఫారెక్స్ సపోర్ట్ ను అందించిందని హైకమిషన్ తెలిపింది.

Spread the love
error: Content is protected !!