Recent Posts

యునెస్కో ఎగ్జిక్యూటివ్‌ బోర్డుకు ఎన్నికైన భారత్

అమరావతి: 2021-25 కాలపరిమితికి సంబంధించి యునెస్కో ఎగ్జిక్యూటివ్‌ బోర్డుకు జరిగిన ఎన్నికల్లో భారత్‌ 164 ఓట్లతో విజయం సాధించింది..దీంతో మరో 4 సంవత్సరాల పాటు యునెస్కో (యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్) తీసుకునే నిర్ణయాలను పరిశీలిస్తుందని పారిస్‌లోని భారత శాశ్వత ప్రతినిధి బృందం ప్రకటించింది..ఐక్యరాజ్యసమితికి చెందిన మూడు రాజ్యాంగ విభాగాల్లో యునెస్కో ఎగ్జిక్యూటివ్‌ బోర్డ్‌ ఒకటి. ఈ విభాగాని సాధారణ సమావేశం ద్వారా ఎన్ను కుంటారు..సంస్థ పనితీరును, కార్యక్రమాలను, డైరెక్టర్ జనరల్ సమ ర్పించిన బడ్జెట్ అంచనాలను ఇది పరిశీలిస్తుంది.ఎగ్జిక్యూటివ్‌ బోర్డుకు గ్రూప్ 4 ఆసియా, పసిఫిక్ స్టేట్స్‌లో జపాన్, ఫిలిప్పీన్స్, వియ త్నాం, కుక్ ఐలాండ్స్, చైనా కూడా ఎన్నికయ్యాయి..మరో సారి అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రాతినిథ్యం వహించనున్నది..

Spread the love
error: Content is protected !!