Recent Posts

వ్యాక్సీనేషన్ లో 40 కోట్ల డోసుల మార్క్ ను దాటేసిన భారత్

అమరావతి: దేశ ప్రజలకు ఉచితంగా వ్యాక్సినేషన్ వేయడంలో ఇండియా మరో మైలురాయిని దాటింది..కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో టీకా వేయడంతో,,వ్యాక్సీన్ వేయించుకున్న వారి సంఖ్య దేశంలో 40 కోట్ల మార్కును దాటేసింది..శనివారం ఇచ్చిన 46.38 లక్షల డోసులతో కలిపి ఈ మార్కును చేరుకుంది..ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. శనివారం 21.18 లక్షల మంది టీకా తొలి డోసు తీసుకోగా.. 2.33 లక్షల మంది రెండో డోసు తీసుకున్నారు. దీంతో 40.49 కోట్ల డోసుల టీకా వేయడం జరిగిందని పేర్కొన్నారు.. 

Spread the love