Recent Posts

కరోనాపై పోరులో దేశ ప్రజలకు 100కోట్ల టీకాల ‘సురక్షిత కవచం’ లభించింది-మోదీ

అమరావతి: దేశంలో వ్యాక్సిన్ పంపిణీ 100కోట్ల డోసులు దాటిన నేపధ్యంలో ప్రజలకు మోదీ శుభాకాంక్షలు తెలియచేస్తు,ఈ ఘనత ప్రతి ఒక్క భారతీయుడికి దక్కుతుందని, కరోనాపై పోరులో దేశ ప్రజలకు 100కోట్ల టీకాల ‘సురక్షిత కవచం’ లభించిందని అభినందించారు.దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ వంద కోట్ల మార్క్ దాటిన సందర్బంగా గురువారం ప్ర‌ధానమంత్రి నరేంద్రమోదీ ఢిల్లీలోని రామ్ మ‌నోహ‌ర్ లోహియా హాస్పిటల్ ను సంద‌ర్శించారు.ప్రధాని హాస్పిటల్ అంతా క‌లియ‌తిరుగుతూ సెక్యూరిటీ గార్డ్స్‌ ను ఆప్యాయంగా ప‌లుక‌రించారు.హాస్పిటల్ సిబ్బంది,పాటు హెల్త్ కేర్ వ‌ర్క‌ర్స్‌ తో పాటు ఓ దివ్యాంగురాలితో మోదీ మాట్లాడారు.అలాగే హాస్పిటల్ వద్ద ఏర్పాటు చేసిన‌ వ్యాక్సినేష‌న్ కేంద్రాన్ని మోదీ ప‌రిశీలించారు.ఢిల్లీ ఎయిమ్స్​లోని NCI (నేషనల్​ కేన్సర్​ ఇన్​స్టిట్యూట్​)లో ఇన్ఫోసిస్​​ సంస్థకు చెందిన విశ్రామ సదన్​ను వర్చువల్ పద్దతిలో ఆవిష్కరించారు..కేన్సర్​ బాధితుల కుటుంబ సభ్యులు విశ్రాంతి తీసుకునేందుకు ఏసీతో కూడిన ఈ కేంద్రాన్ని,రూ.93 కోట్ల వ్యయంతో ఇన్ఫోసిస్​,విశ్రామ్​ సదన్​ను నిర్మించింది..వివరాలు అడిగి తెలుసుకున్న మోదీ ఇన్ఫోసిస్​​ సిబ్బందిని అభినందించారు. అక్కడ భూమి, విద్యుత్​, నీరు ఏర్పాట్లకు ఎయిమ్స్​ ఏర్పాట్లు చేసింది.దేశ ఆరోగ్యసేవలను మెరుగుపరిచేందుకు భారత్ ​లోని కార్పొరేటు, ప్రైవేటు రంగాలు, సామాజిక వ్యవస్థలు ఎనలేని కృషిచేస్తున్నాయని కొనియాడారు..దేశంలో ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల ఏర్పాటు చేయడంలో ప్రైవేటు రంగానిదే కీలక పాత్ర అన్నారు..వ్యాక్సిన్ పంపిణీ 100కోట్ల డోసులు పంపిణీ లాంటి  అద్భుత‌మైన ఘ‌న‌త సాధ‌న కోసం కృషి చేసిన డాక్ట‌ర్లు, న‌ర్సులు, అంద‌రికీ ఆయ‌న కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు.ఇండియా చ‌రిత్ర సృష్టించిన‌ట్లు ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ లో పేర్కొన్నారు.భార‌తీయ సైన్సు, వ్యాపారంతో పాటు 130 కోట్ల మంది భార‌తీయుల స్పూర్తికి ఇది సాక్ష్య‌మ‌న్నారు..

Spread the love
error: Content is protected !!