Recent Posts

గడచిన 24 గంటల్లో 19 రాష్ట్రలో ఒక్క కేసు నమోదు కాలేదు-కేంద్ర ఆరోగ్యశాఖ

అమరావతి: కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నట్లు కన్పిస్తున్న,,దేశంలోని 19 రాష్ట్రల్లో ఈ రోజు ఒక కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ పేర్కొంది..కోవిడ్ మరణాల సంఖ్య 100 దిగువకు చేరడం ఊరటనిచ్చే అంశం..గడచిన 24 గంటల్లో 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాలేదని ఆరోగ్యశాఖ ప్రకటించింది..వీటిలో పశ్చిమబెంగాల్‌, గుజరాత్, రాజస్థాన్‌, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, ఝార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌, బిహార్‌, లక్షద్వీప్‌, లద్దాఖ్‌, సిక్కిం, త్రిపుర, మణిపూర్‌, మిజోరాం, మేఘాలయ, నాగాలాండ్‌, అండమాన్‌ నికోబార్‌ దీవులు, డయ్యుడామన్‌ దాద్రానగర్‌ హవేలీ, అరుణాచల్‌ ప్రదేశ్‌లు ఉన్నాయి..మంగళవారం  మొత్తంగా 91 మరణాలు నమోదు కాగా వాటిలో మహారాష్ట్ర (30), పంజాబ్‌ (18), కేరళ (13) మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి..

Spread the love