Recent Posts

కేరళ నుంచి తమిళనాడులోకి రావలంటే, ఆర్టీపీసీఆర్ స‌ర్టిఫికెట్ వుండాల్సిందే

అమరావతి: త‌మిళనాడులో ప్ర‌స్తుతం కరోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో రాష్ట్రంలో అన్ని రకాల వ్యాపారాలు,ఆఫీసులు ప్రారంభంమౌవుతున్నాయి. త‌మిళ‌నాడు స‌రిహ‌ద్దు క‌లిగిన కేర‌ళలో కరోనా కేసులు సంఖ్య రోజు రోజుకు పెరుగడం ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది. ప్ర‌తిరోజు కేరళలో 20 వేల‌కు పైగా కేసులు న‌మోద‌వుతున్నాయి.గత ఐదు రోజుల్లో ల‌క్ష‌కు పైగా కేసులు న‌మోద‌య్యాయి.దీంతో కేర‌ళ నుంచి త‌మిళ‌నాడు వ‌చ్చే ప్ర‌యాణికులు ఎవ‌రైనా స‌రే త‌ప్ప‌ని స‌రిగా ఆర్టీపీసీఆర్ టెస్టుకు సంబందించి స‌ర్టిఫికెట్ వెంట తెచ్చుకోవాల‌ని సూచించింది.ఆగ‌ష్టు 5వ తేది నుంచి ఈ నిబంధ‌న‌లు అమ‌లులోకి వ‌స్తాయ‌ని తమిళ‌నాడు ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది.ఒక‌వేళ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ పూర్తి కాకుండానే మూడో వేవ్ ఎంట‌రైతే ప‌రిస్థితి మ‌రింత దారుణంగా ఉంటుంద‌ని తమిళనాడు రాష్ట్ర ఆరోగ్య‌శాఖ ఆందోళ‌న చెందుతున్న‌ది.  

Spread the love