Recent Posts

భారత్​లో,భారత్​ కోసం సరికొత్త ఆవిష్కరణలు చేయాలి-ప్రధాని మోదీ

జనవరి 16న జాతీయ అంకుర..

అమరావతి: అంకుర సంస్థలు నవ భారతానికి వెన్నెముకగా మారనున్నాయని,, యువతకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.శనివారం స్టార్టప్‌ల ప్రతినిధులతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.ఆరు అంశాలపై స్టార్టప్‌ ప్రతినిధులు ప్రజెంటేషన్‌ ఇచ్చారు.ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ,,దేశంలోని ప్రతి జిల్లాలోనూ అంకుర సంస్థలు రావాలన్నారు.కొత్త ఆవిష్కరణలతో ముందుకొస్తున్న యువతకు మోడీ అభినందనలు తెలిపారు. విశ్వయవనికపై భారత అంకుర పతాకం ఎగురవేయాలన్నారు..ప్రస్తుతం దేశంలో 60వేలకు పైగా స్టార్ట్​అప్​ సంస్థలు, 42 యూనికార్న్​ కంపెనీలు ఉన్నాయన్నారు. భారత్​ ఎదుర్కొంటున్న సమస్యలకు సృజన, సాంకేతికతపరమైన పరిష్కారాలు కనుగొనేందుకు ప్రయత్నించాలని సూచించారు. ఇన్నోవేషన్​, వ్యవస్థాపకత, స్టార్ట్అప్ ఎకోసిస్టమ్​ లాంటి మూడు అంశాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందన్నారు..2013-14లో 4వేల పేటెంట్స్,, 70 వేల ట్రేడ్ మార్కులు రిజిస్ట్రేషన్ కాగా, 2020-21 సంవత్సరం వచ్చే సరికి, 28వేల పేటెంట్స్,,2.5 లక్షల ట్రేడ్​మార్క్​లు రిజిస్ట్రేషన్​లు జరిగాయన్నారు..అలాగే గ్లోబల్ ఇన్నోవేషన్​ ఇండెక్స్​లో భారత్ 46వ స్థానంలో కొనసాగుతోంది. 2015లో 81 స్థానంలో ఉండేదన్నారు..అంకుర సంస్థలు నూతన ఆవిష్కరణలకు మాత్రమే పరిమితం కావడం లేదని.. వాటివల్ల ఉద్యోగ కల్పన కూడా జరుగుతోందన్నారు..అంకుర సంస్థల ప్రాముఖ్యాన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లేందుకు ప్రతి సంవత్సరం జనవరి 16వ తేదిన నేషనల్ స్టార్ట్​అప్ డేను నిర్వహించనున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు..

Spread the love
error: Content is protected !!