Recent Posts

నన్ను పచ్చి బూతులు తిడితే భయపడే వ్యక్తిని కాదు-పవన్ కళ్యాణ్

అమరావతి: త‌న‌కు రాజ‌కీయాలంటే స‌ర‌దా కాద‌ని, ఒక బాధ్య‌త‌గా తీసుకున్నాన‌ని,నన్ను పచ్చి బూతులు తిడితే భయపడే వ్యక్తిని కాదని ఘటుగా వ్యాఖ్యనించారు…శనివారం రాజ‌మండ్రిలో వర్షం పడుతున్న సమయంలోనే పవన్ కల్యాణ్ తన ప్రసంగాన్ని ప్రారంభించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు..అంద‌రిని క‌లుపుకొని పోవాల్సిన అవ‌న‌సం ఉంద‌ని,క‌మ్మ‌ల‌కు వ్య‌తిరేకం కాద‌ని చెప్పేందుకే తాను 2014లో టీడీపికి మ‌ద్ధ‌తు ఇచ్చాన‌ని, అయితే, ఇప్పుడు టీడీపీ స‌త్తా స‌రిపోవ‌డం లేద‌ని, అందుకే తాను రంగంలోకి దిగాల్సి వ‌చ్చింద‌ని ప‌వ‌న్ పేర్కొన్నారు..బీజేపీ కార్య‌కర్త‌ల‌ను కూడా వైసీపీ నేత‌లు వ‌ద‌ల‌డంలేద‌ని అన్నారు…వైసీపీ మంత్రులు, తనపై విమర్శలు గుప్పించిన సినీ ప్రముఖులకు ఈ సభా వేదికగా స్ట్రాంగ్ కౌంటర్లు, వార్నింగ్‌లు ఇచ్చారు..ముఖ్యంగా పవన్‌ను వ్యక్తిగతంగా విమర్శలు, బూతులు తిట్టిన వారిపై తీవ్ర స్థాయిలో పవన్ విరుచుకుపడ్డారు.నన్ను పచ్చి బూతులు తిడితే భయపడే వ్యక్తిని కాదు. నిలబడటానికి ఎన్ని దెబ్బలు తిన్నానో మీకేం తెలుసు ? ఒడిదొడుకులు,ఆపజయాలు అధిగమించి ముందుకు నడిచేందుకు వచ్చాను.. కుల, మత, వర్గ రహిత సమాజం నిర్మించడం మన ఆకాంక్ష..కులాల పేరిట రాజకీయాలు చేస్తున్నారు..టీవీల్లో నన్ను తిడితే భయపడతానని అనుకుంటే అది కేవలం మీ భ్రమ మాత్రమే అన్నారు..గుంతలు లేని రోడ్డు ఒక్కటైనా రాష్ట్రంలో ఉందా ? మనం ఇచ్చే పన్నులు ప్రభుత్వ ఖజానాకు వెళ్తాయి కదా ? మరి మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు..యాక్షన్‌, కెమెరా, కట్‌ అంటే వెళ్లే పోయే వ్యక్తిని కాదన్నారు.. సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తి అలా మాట్లాడడం సరియైంది కాదన్నారు..బూతులు తిడితే తొక్కిపట్టి నార తీస్తా, ఇక నుంచి ఊరుకునేది లేదు? ధవళేశ్వరం వంతెన అంటే రోడ్డు వేశారు..పుట్టపర్తి అంటే అక్కడ కూడా రోడ్డు వేశారు.. నా సహనాన్ని ఇక పరీక్షించొద్దు…కనీసం రెండు దశాబ్దాలు నాతో ప్రయాణం చేయగలిగితేనే జనసేనలోకి రండి…నేను తూర్పుగోదావరి జిల్లాలోకి అడుగుపెట్టలేనని బెట్టింగ్‌లు కట్టారు…నన్ను నోటికి వచ్చినట్లు మాట్లాడొద్దు..అలాంటి మాటలను విని సహించే మెతక లీడర్లు ఉన్న రోజులు కావని గుర్తుంచుకోవాలని హెచ్చిరించారు.. రాష్ట్ర రాజకీయాలు రెండిళ్ల మధ్య జరిగితే కుదరదు..ఒక కులాన్ని వర్గ శత్రువుగా చేసుకుని వైసీపీ రాష్ట్రాన్ని నాశనం చేసింది..అందుకే రోడ్లు లేవు, జీతాలు-పెన్షన్లు రావు. నేను బైబిల్ చేత్తో పట్టుకుని తిరిగే వాడిని కాదు..ప్రజలను  గుండెల్లో పెట్టుకుంటాను..కాపు, ఒంటరి, తెలగలు, బలిజలు ముందుకు వస్తే తప్ప రాష్ట్ర రాజకీయాల్లో మార్పు రాదన్నారు.. నాలుగు కులాలు పెద్దన్న పాత్ర పోషిస్తే తప్ప మిగిలిన కులాలకు సాధికారిత రాదని జనసేనాని పవన్ ఘటుగా వ్యాఖ్యానించారు..యుద్ధం చేయాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని, ఈ యుద్ధంలో తాను చ‌నిపోతే దేశం న‌లుమూల‌లా పిడిక‌డు మ‌ట్టి వేయాల‌ని ప‌వ‌న్ పేర్కొన్నారు. ప్ర‌భుత్వం జ‌న‌సైనికుల‌ను అడ్డుకోకుంటే సుమారు ల‌క్ష‌మందితో స‌భ జ‌రిగేద‌ని ప‌వ‌న్ పేర్కొన్నారు.  

Spread the love
error: Content is protected !!