Recent Posts

దమ్ముంటే నా మొత్తం ఆస్తులు,సంపాదన మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించుకో-ఈటల

 రాజీనామకు సిద్దం…

హైదరాబాద్: ఉద్యమ సమయంలో నీ వెంటే ఉంటూ,నా కుటుంబాల గురించి పట్టించుకోలేదని,,గడిచిన 20 సంవత్సరల్లో వ్యక్తిగతంగా నేను వ్యాపారాలపై దృష్టికూడా పెట్టలేదు,,రాజకీయంగా నేను నీకు అడ్డంగా వున్నాను అనే ఉద్దేశంతో నాపై అవినితి అరోపణలు మోపినంత మాత్రన కుంగిపోయేది లేదని తెలంగాణ మాజీ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల.రాజేంద్ర స్పష్టం చేశారు..సోమవారం అయన మీడియా సమావేశంలో మట్లాడుతూ తెలంగాణలో మహిళా పారిశ్రాకవేత్తలకు, ఎంట్రప్రెన్యూర్స్ కు ఆదరణ ఉంటుందనే నమ్మకంతో నా భార్య,కొడుకు మా పౌల్ట్రీ వ్యాపారాన్ని పెంచుదామనుకున్నారని, నిబంధనల ప్రకారంమే ముందుకెళ్లాం తప్ప అవినీతికి పాల్పడలేదన్నారు..అయినాసరే ఏదో కబ్జాలు జరిగిపోయాయని ప్రచారం చేసి,,కలెక్టర్ తో విచారణ చేయించి, మంత్రి పదవి ఊడబీకారు అని ఆరోపించారు..ఒక వేళ మీ ఆరోపణలే నిజం అనుకున్నా, భూమికి సంబంధించినవాళ్లు లేకుండా, వందలాది మంది పోలీసుల్ని పెట్టి మీకు మీరే కొలతలు తీసుకోవడం చట్టవిరుద్ధం కాదా ? కనీసం 15 రోజుల ముందు నోటీసులు ఇవ్వాల్సి ఉన్నా, ఏకపక్షంగా చర్యలకు దిగడం నిబంధనలకు విరుద్దమని,,ఎమ్మార్వో చేయాల్సిన పనిని కలెక్టర్ చేయడం అంతకంటే అసంబద్దం అన్నారు..దీన్ని బట్టే మీ కుట్రల బుద్ది ఏందో అర్థమైతోంది,,ఈ చట్టవ్యతిరేక విధానాలపై నేను న్యాయపోరాటం చేస్తానని చెప్పారు..కేసీఆర్ అనుకుంటే ఎవడినైనా ఆగం పట్టించేదాకా నిద్రపోడని నాకు తెలుసు అని అందుకే ఏకపక్షంగా కేసులు,, బర్తరఫ్ నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు..తెలంగాణలో ఎన్ని వేల కంపెనీలకు ఎన్ని లక్షల ఎకరాల అసైన్డ్ భూముల్లో మధ్యలో వెళ్లాయో,, ఎర్రవల్లిలోని మీ ఫామ్ హౌజ్ కు ఎన్ని అసైన్డ్ భూములు దారితీస్తాయో ఒక్కసారి పరిశీలించుకొవాలన్నారు..మహ అయితే నన్ను జైలులో ఎన్ని రోజులు పెడతావ్? దమ్ముంటే నా మొత్తం ఆస్తులు, సంపాదన మీద సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించొచ్చుకదా ? పెట్టుకో,, నీకు ఇష్టమొచ్చినన్ని కేసులు పెట్టుకో,, దేనికైనా నేను సిద్ధం…ఆస్తులు,, సంపాదన అంతా పోగొట్టుకోడానికి నేను వెనుకాడను,,ఆఖరికి చావునైనా భరిస్తా కానీ ఆత్మగౌరవంతోనే బతుకుతా…నిన్ను క్షమించడానికి నేను రుషిని కాను..ఈ విషయం గుర్తుంచుకోవాలంటు హెచ్చిరించారు..

Spread the love