Recent Posts

వరదల కారణంగా పొలాల్లో ఇసుక మేటలు వేస్తుంటే-ఇసుక అమ్ముతామంటు ప్రకటనలు ఏంటి-పవన్

హైదరాబాద్: భారీ వర్షాలతో వరదల భీభత్సంతో ఒక వైపు రాష్ర్టాన్ని కుదిపేస్తుంటే, ప్రజలు ఇళ్లు, వాకిళ్లు వదిలి రోడ్డున పడుతున్నరని,,పశునష్టం, పంట నష్టం జరిగిందని వరద నివారణ చర్యలను ప్రభుత్వం ప్రారంభించలేదని వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్టర్ వేదికగా మండిపడ్డారు.. పేర్కొన్నారు..పచ్చని పొలాల్లో ఇసుక మేటలు వేసి రైతులు ఏడుస్తుంటే ఈ సమయంలో ఇసుక అమ్ముతాం అంటూ ప్రకటనలు ఇస్తున్నారని, ఈ ప్రభుత్వానికి ప్రజా క్షేమం అక్కరలేదా అంటూ ప్రశ్నించారు..అసలు ఈ ప్రభుత్వానికి ఇంగిత జ్ఞానం ఉందా ? అంటూ ఆయన ట్వీట్‌ చేశారు.వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్ని స్తే వారిపై వ్యక్తిగత దాడులకు దిగుతూ దూషిస్తున్నారని ఇది సమంజసం కాదని ఆయన పేర్కొ న్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించు కోవాలన్నారు..రాష్ర్టం ఓ వైపు వరదలతో సతమతమ వుతుంటే మరోవైపు ఇసుక అమ్మకాలకు ప్రకటనలు ఇవ్వడం ప్రభుత్వ లాభా పేక్షకు నిదర్శనమని ఆయన అన్నారు. ఇంతకన్నా హేయమైన చర్య ఇంకొకటి ఉండదన్నారు.

Spread the love
error: Content is protected !!