AMARAVATHI

ఒక్క రూపాయి జీతం తీసుకోకుండా పనిచేస్తాను-పవన్ కళ్యాణ్

అమరావతి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలులో సోమవారం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.. పలువురు లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు..పింఛన్ల పంపిణీ అనంతరం పవన్ మాట్లాడుతూ పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలా అని అనుకున్నాను…ఈ విధంగా చెప్పినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు… నేను బాధ్యతలు తీసుకున్న చాలా కీలకమైన శాఖలు…నేను తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేద్దాం అనుకుంటున్నాను… పంచాయతీ శాఖలో ఎన్ని వేల కోట్లు అప్పులు ఉన్నాయో తెలియడం లేదు… అసలు ఏ హెడ్ కింద ఎన్ని అప్పులు ఉన్నాయో కూడా అర్ధం కావట్లేదు… పంచాయితీ రాజ్ శాఖ లెక్కలు చూస్తుంటే..నిధులు ఎటు వెళ్ళాయో అర్థం కావట్లేదని, గత పాలకులకు చురకలు అంటించారు… రూ.600 కోట్లు ఖర్చు చేసి రుషికొండలో భవనాలు కట్టారని… అదే డబ్బుతో ఎంతో అభివృద్ధి జరిగి ఉండేదని అన్నారు… ఇప్పుడు ఆ నిధులన్నీ బుడిదలో పోసిన పన్నీరు అయిందని విమర్శించారు… తన కార్యాలయంలోకి ప్రభుత్వం తరపున ఫర్నీచర్ ఇస్తాము అని అధికారులు చెబితే వద్దూ, నేనే కొనుకుంటాని చెప్పానన్నారు… తన వైపు నుంచి అవినీతి అనేది ఉండదని మాట ఇస్తున్నానన్నారు… పంచాయతీరాజ్ శాఖలో జలజీవన్ మిషన్ పథకంలో భాగంగా ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి ఉండాలని ఆదేశించారు…

సినిమా హీరోగా నా ఎకౌంట్స్ కి సంబంధించి,, గడిచిన 20 సంవత్సరాల్లో ఎప్పుడూ ఒక గంట సేపు కూడా కూర్చోలేదు… అభివృద్దికి ఖర్చుకావాల్సిన నిధులు ఎక్కడికి పోయాయో అని ఒక్కో సెక్షన్ లో నాలుగైదు గంటలు కూర్చున్నాను… ఒకప్పుడు నేను జీతం తీసుకుని పనిచేద్దాం అనుకున్నాను కానీ ఈ ఖాళీ అయిన నిధులు చూస్తే జీతం తీసుకోకూడదని అనుకుంటున్నాను…నాకు జీతం అవసరం లేదు…నా దేశం కోసం, నా నేల కోసం నేను ఉచితంగానే పని చేస్తాను అన్నారు…దీంతో తన శాఖల్లో తక్కువ నిధులు ఉన్నాయని జీతం తీసుకోకుండానే రాష్ట్రం కోసం పనిచేయడానికి పవన్ సిద్ధమయ్యారు..

Spread the love
venkat seelam

Recent Posts

సీబీఐ కోర్టులో ఉన్న జగన్‌ కేసులను రోజువారీగా విచారించండి-తెలంగాణ హైకోర్టు

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేసుల పిటిషన్‌కు సంబంధించి తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది.. జగన్ కేసులకు…

8 hours ago

తిరుమలలో దళారుల ఏరివేతకు చర్యలు తీసుకోండి – టీటీడీ ఈవో జె.శ్యామలరావు

తిరుమల: తిరుమల శ్రీవారి భక్తులను మోసగిస్తున్న దళారులను కనిపెట్టి ఎప్పటికప్పుడు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా టీటీడీ ఈవో జె.శ్యామలరావు…

8 hours ago

రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లు

నెల్లూరుకు ఒ.ఆనంద్.. అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లా కలెక్టర్​లను నియమిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. శ్రీకాకుళం…

1 day ago

తిరుపతి జిల్లా కలెక్టర్ గా డా.ఎస్. వెంకటేశ్వర్ ఐ.ఎ.ఎస్

తిరుపతి: డైరెక్టర్ సెకండరీ హెల్త్ గా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న డా.ఎస్.వెంకటేశ్వర్ ఐ.ఎ.ఎస్ ను తిరుపతి జిల్లా కలెక్టర్ గా…

1 day ago

రూ.249కి కొత్త ప్లాన్ ప్రవేశ పెట్టిన BSNL

అమరావతి: దేశీయ ప్రభుత్వ రంగ టెలికం సంస్థ (BSNL) వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఒక కొత్త ప్లాన్‌ను పరిచయం చేసింది.. దీని…

1 day ago

రూ.10,20 నాణేలను తిరస్కరిస్తే చట్ట ప్రకారం నేరం-ఉత్తర్వులు జారీ చేసిన రిజర్వ్ బ్యాంకు

IPC సెక్షన్ 124A... అమరావతి: ప్రభుత్వం గుర్తించిన 10 లేక 20 రూపాయల నాణేలను తిరస్కరిస్తే చట్ట ప్రకారం నేరం…

2 days ago

This website uses cookies.