Recent Posts

జిల్లా అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తా-జెడ్పి చైర్ పర్సన్ ఆనం.అరుణమ్మ

నెల్లూరు: జిల్లా అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని నూతనంగా ఎన్నికైన జెడ్పి చైర్ పర్సన్ శ్రీమతి ఆనం.అరుణమ్మ స్పష్టం చేశారు.శనివారం మధ్యాహ్నం నెల్లూరు జిల్లా పరిషత్ 14వ చైర్ పర్సన్ గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ పదవి రావడానికి  సహకరించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఆమె ధన్యవాదాలు తెలిపారు.జిల్లా మంత్రులు,  ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధుల,  అధికారుల సహాయ సహకారాలతో జిల్లా అభివృద్ధికి తన వంతు బాధ్యతగా కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.

Spread the love
error: Content is protected !!