Recent Posts

నేను ప్రమాణం చేశాను,జగన్ రెడ్డి,హత్యకేసుతో వారి కుటుంబంకు సంబంధలేదని ప్రమాణం చేస్తాడా-లోకేష్

తిరుపతి: తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు రాజకీయ ఆరోపణ ఆస్త్రలు సంధిస్తు దూసుకుపోతున్నాయి.. తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం తిరుపతికి చేరుకుని పార్టీ అభ్యర్థి కోసం ప్రచారం నిర్వహిస్తున్నాయి.. అలిపిరి వద్ద  నారా లోకేష్ ప్రమాణం చేశారు.. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని నారా లోకేష్ ప్రమాణం చేశారు.. అనంతరం లోకేష్ మాట్లాడుతూ తమ కుటుంబానికి వై.ఎస్ వివేక హత్యకు ఎలాంటి సంబంధం లేదని తాను ప్రమాణం చేశానని,, జగన్ కూడా అయనకు ఈ హత్యతో ఎలాంటి సంబంధం లేదని ప్రమాణం చేస్తాడా అని ప్రశ్నించారు.. తన సవాల్ ను స్వీకరించి వెంకన్న సాక్షిగా ప్రమాణం చేయాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు.. ఎన్నికలకు ముందు జరిగిన వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ జరపాలని జగన్ గతంలో డిమాండ్ చేశాడని,, ఎన్నికలు పూర్తయ్యి జగన్ సీఎం అయ్యాక ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదు ? సీబీఐకి ఎందుకు సహకరించడం లేదంటూ ప్రశ్నించారు.. తన చెల్లికి న్యాయం చేయలేని సీ.ఎం జగన్,, రాష్ట్రంలోని మహిళలకు ఎలా న్యాయం చేస్తాడని నిలదీశారు.. 

Spread the love