Recent Posts

భారీ వర్షం ధాటికి మళ్లీ నీట మునుగుతున్న హైదరాబద్ నగరం

హైదరాబాద్ : జంట నగరాల్లో వర్షా కాలం వచ్చిందంటే జల జతరే…చిన్నపాటి వర్షంకు డ్రైనేజ్ లు పొంగి ట్రాఫిక్ ఆస్తవ్యస్తం అవుతుంది..అలాంటిది గత రెండు రోజుల నుంచి ఏకధాటికి కురిసిన కుండపోత వానతో రహదారులన్నీ నీటముని పోగా, కాలనీలుజలమయ మయ్యాయి.ఎమ్మేల్యే సుధీర్ కారు వరద నీటిలో చిక్కుకున్న పోవడంతో,కారను తొసుకుంటూ ముందుకు తీసుకెళ్లారు..ఇళ్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది..మూసి పరివాహక ప్రాంతాల్లో డ్రైనేజీలు ఉప్పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలకు దిల్‌సుఖ్‌నగర్‌, చైతన్యపురి, కమలానగర్‌ ప్రాంతాల్లో కాలనీలు దాదాపు నీట మునిగాయి. సరూర్‌నగర్‌ చెరువులోకి భారీగా వరద చేరడంతో చైతన్యపురి పరిధిలో పలు కాలనీలు ముంపునకు గురయ్యాయి.దిల్‌సుఖ్‌నగర్‌లోని పీ అండ్‌ టీ కాలనీ, కోదండరామ్‌ నగర్‌ వీవీ కాలనీల్లో వీధులు నదులను తలపించాయి. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరదతో ఇళ్లల్లోకి నీరు చేరడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. హయత్‌నగర్‌ ఆర్టీసీ డిపోలోకి భారీగా వరదనీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షానికి నాగోల్ పరిధిలోని అయ్యప్పకాలనీ నీట మునిగింది. దీంతో కాలనీ ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి తమ బంధువుల ఇళ్లకు వెళ్లిపోతున్నారు.ఈ ప్రాంతంలో సుమారు 400 ఇళ్లు ఉండగా,దాదాపు సగం ఇళ్లలోకి వరద ప్రవాహం వచ్చి చేరింది.పర్యవసనం అయ్యప్పనగర్‌ కాలనీ, మల్లికార్జుననగర్, ఫేజ్-2 త్యాగరాజనగర్‌కాలనీ వాసులు ఇళ్లు ఖాళీ చేసి బయటకెళ్లారు. హబ్సిగూడా, అంబర్‌పేట్‌, రామంతపూర్ డివిజన్లలో కురిసిన భారీ వర్షానికి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. యూసుఫ్‌గూడ, శ్రీ కృష్ణనగర్ బి బ్లాకులో వరద నీరు రోడ్లపై భారీగా ప్రవహించింది. ఎల్బీనగర్‌లో గత ఏడాది వరద పరిస్థితులు మళ్లీ కన్పిస్తున్నాయి..ఇంళ్లలోకి వర్షపు చేరుతుండడంతో కొన్నిచోట్ల నడుంలోతు, చాలాచోట్ల మోకాళ్ల లోతు వరకు నీరు చేరింది..ఎల్బీనగర్‌లో 15 సెంటీమీటర్ల వర్షం కురవడంతో ఆ వర్షం నీరు డ్రైనేజీల్లోంచి బయటకు వెళ్లే మార్గం లేక రోడ్లపై నిలిచిపోయింది..భారీ వర్షాలు మరో రెండ్రోజులపాటు కంటిన్యూ అయితే గనుక ముంపు కాలనీల్లోని జనాల్ని తరలించేందుకు బోట్లు తిప్పాల్సిన పరిస్థితి రావచ్చు.గతేడాది వర్షాల తర్వాత 858 కోట్లతో నాలాల విస్తరణ ప్రతిపాదన చేపట్టిన జీహెచ్ఎంసీ, ఏడాదిలో ఖర్చుపెట్టింది కేవలం ఒక కోటి 50 లక్షలు మాత్రమే.

Spread the love